TTD : వెంకన్న కొత్త బుక్.. ఈ పుస్తకంలో తిరుమల మొత్తం సమాచారం.. .

TTD : వెంకన్న కొత్త బుక్.. ఈ పుస్తకంలో తిరుమల మొత్తం సమాచారం.. .

TTD : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కొత్త బుక్ రిలీజ్ చేసింది. భక్తులకు అందిస్తున్న అనేక సేవలను తెలుపుతూ తెలుగు, ఆంగ్ల భాషల్లో భక్త సేవ అనే పుస్తకాన్ని మంగళవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర దేవాదాయశాఖ, ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ఆవిష్కరించారు.

పవిత్ర స్థలంలో అందుబాటులో ఉన్న అనేక రకాల సేవలపై పుస్తకాన్ని ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందని డిప్యూటీ సీఎం అన్నారు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల సౌకర్యార్ధ్యం కొన్నేళ్ళుగా అనేక సేవా కార్యక్రమాలను చేపట్టడం జరుగుతోందని సత్యనారాయణ తెలిపారు. ఇటీవల కాలంలో అనేక కొత్త సర్వీసులు వచ్చాయని, ముఖ్యంగా కాలుష్య రహిత ఎలక్ట్రిక్ బస్సులు, శ్రీవారి పూజల కోసం పూలతోట అభివృద్ధి, శ్రీవారి పూజల్లో గోవుతో తయారు చేసిన ఉత్పత్తులను అందించడం, ఘాట్ రోడ్డు పునర్నిర్మాణం, మరిన్ని అన్నప్రసాద కేంద్రాలు, పవిత్ర ఉద్యానవనాల అభివృద్ధి జరిగిందన్నారు.

శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ మాజీ సీఈఓ డాక్టర్ విజయకుమార్ రచయిత. టీటీడీ చేస్తున్న అనేక సేవా కార్యక్రమాలపై యాత్రికులకు అవగాహన కల్పించేందుకు ఈ పుస్తకాన్ని తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రచించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పుస్తక రచనలో తోడ్పాటును అందించిన మీడియా ప్రతినిధులు జి.నాగరాజు, కె. జయరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story