CBN: రాయి దాడిలో ఉమాను ఇరికించే కుట్ర

CBN: రాయి దాడిలో ఉమాను ఇరికించే కుట్ర
వైసీపీ కుట్రలకు పాల్పడుతోందన్న చంద్రబాబు... తప్పు చేసే అధికారులను వదిలే ప్రసక్తే లేదని హెచ్చరిక

ఎన్నికల్లో ఓటమి భయంతో తెలుగుదేశం నేతలపై వైసీపీ కుట్రలకు పాల్పడుతోందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ MLA బొండా ఉమాను సీఎంపై దాడి కేసులో ఇరికించే కుట్రలకు పాల్పడుతోందని ఆరోపించారు. తప్పు చేసే అధికారులను వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. నిందితులంటూ వడ్డెర కాలనీకి చెందిన యువకులను, మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని.. దీనిపై ఆ కుటుంబాలు ఆందోళనలో ఉన్నాయని చంద్రబాబు అన్నారు. సానుభూతి కోసం చేసిన గులకరాయి డ్రామాలో బీసీ బిడ్డను బలిచ్చేందుకు జగన్ రెడ్డి కుట్ర చేశాడని.... తెలుగుదేశం ఏపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఆరోపించారు. కోడికత్తి డ్రామాలో దళిత బిడ్డను జైలుపాల్జేశారని...ఇప్పుడు.. బీసీ వర్గానికి చెందిన సతీష్ అనే అమాయకపు యువకుడిని ఇరికిస్తున్నారని దుయ్యబట్టారు. సీఎంపై దాడి కేసులో బొండా ఉమామహేశ్వరరావును ఇరికిస్తున్నారని....... డీజీపీ, ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌కుమార్‌మీనాకు తెలుగుదేశం నేత వర్ల రామయ్య........ ఫిర్యాదు చేశారు. గులకరాయి డ్రామాలో పాత్రధారులుగా మారిన పోలీస్ అధికారులపై కూటమి ప్రభుత్వం వచ్చాక కఠిన చర్యలు తీసుకుంటామని.. తెలుగుదేశం అధికార ప్రతినిధి పట్టాభి హెచ్చరించారు.


సీబీఐ విచారణకు డిమాండ్‌

సీఎం జగన్ పై రాయి దాడి అంతా డ్రామా అని తెలుగుదేశం సీనియర్ నేతలు వర్ల రామయ్య, షరీఫ్ ఆరోపించారు. ఈ అంశంపై గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ను కలిసిన NDA కూటమి నేతలు చంద్రబాబు, పవన్ పై జరిగిన రాళ్ల దాడి ఘటనను వివరించారు. జగన్ రాయి దాడిపై విజయవాడ సీపీతో కాకుండా. సీబీఐతో విచారణ జరిపించాలని గవర్నర్ ను కోరారు. సిట్ కార్యాలయం వద్ద కీలకపత్రాల దహనంపైనా గవర్నర్ కు నేతలు ఫిర్యాదు చేశారు.

జగన్‌కు భారీ భద్రత

ఇటీవల దాడి నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ భద్రతలో మార్పులు, చేర్పులు చేశారు. ప్రస్తుత భద్రతకు అదనంగా సెక్యూరిటీని ఏర్పాటు చేయగా.. బస్సు యాత్ర మార్గాల్లో డీఎస్పీ లతో భద్రత కల్పిస్తారు. సీఎం రూట్ మార్గాలను సెక్టార్లుగా విభజించి.. సెక్టార్‌కు ఒక డీఎస్పీ ఇద్దరు సీఏలు, నలుగురు ఎస్సైలు సెక్యూరిటీ కల్పిస్తారు. ఇకపై నిర్దేశించిన ప్రాంతాల్లోనే సీఎం రోడ్‌షోలు, సభలు ఉండనుండగా.. గజమాలలు, పువ్వులు విసరడంపై ఆంక్షలు అమల్లో ఉంటాయి. సీఎం జగన్‌పై రాయితో దాడి చేసిన కేసుపై పోలీసులు కీలక ప్రకటన చేశారు. దాడి చేసిన వారి వివరాలు తెలిపిన వారికి రూ.2లక్షల నగదు బహుమతి ఇస్తామని ప్రకటించారు. వివరాలు తెలిస్తే 9490619342, 9440627089 నంబర్లకు సమాచారం ఇవ్వాలని ఎన్టీఆర్ జిల్లా పోలీసులు కోరారు.

Tags

Read MoreRead Less
Next Story