Balakrishna : ఏప్రిల్ 12వ తేదీ నుంచి బాలకృష్ణ ఎన్నికల ప్రచారం

Balakrishna : ఏప్రిల్ 12వ తేదీ నుంచి  బాలకృష్ణ ఎన్నికల ప్రచారం

ఏప్రిల్ 12వ తేదీ నుంచి టీడీపీ నేత, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Balakrishna) ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. కదిరి నుంచి ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఈ నెల 25 నుంచి ఉత్తరాంధ్రలో చేపట్టనున్న ప్రచారంలో ఆయన పాల్గొననున్నారు. 19వ తేదీన హిందూపురంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తారు. హిందూపురం నియోజకవర్గంలో హ్యట్రిక్ కోసం బాలకృష్ణ పోటీలో ఉన్నారు.

హిందూపురంలో వైసీపీని గెలిపించడాన్ని సవాల్ గా తీసుకున్నారు. ఇంచార్జ్ మంత్రి పెద్దిరెడ్డి. హిందూపురం టీడీపీ నేతల్ని వైసీపీలో చేర్పించేందుకు ఆయన భారీగా ఖర్చు పెడుతున్నారు. ఆయన హిందూపురంలో వైసీపీని గెలిపించడాన్ని సవాల్ గా తీసుకున్నారు. టీడీపీకి బలమైన ఓటు బ్యాంక్ ఉన్న హిందూపురం పట్టణం, చిలమత్తూరు మండలాల్లో భారీగా డబ్బు ఆశ చూపి అయినా టీడీపీ నేతల్ని చేర్చుకుంటున్నారు. వారిని ఆపేవారు లేరు. వైసీపీ అభ్యర్థి మాత్రం రోజూ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. వైసీపీ హిందూపురం అభ్యర్థి దీపిక, ఆమె భర్త వేణు రెడ్డి ఇద్దరూ ప్రతి రోజు షెడ్యుల్‌ రూపోందించుకుని చెరొక ప్రాంతంలో ప్రచారం చేస్తున్నారు.

హిందూపురం నియోజకవర్గంటీడీపీకి కంచుకోట. పార్టీ ఆవిర్భావం నుంచి ఇక్కడ ఓటమన్నది లేకుండా ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా నందమూరి కుటుంబ సభ్యులు ఇక్కడి నుంచి పోటీ చేసి గెలుపొంది అసెంబ్లీకి వెళ్లారు. టిడిపి వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు హిందూపురం నుంచి పోటీ చేసి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన తర్వాత అతని కుమారుడు హరికృష్ణ కూడా ఎమ్మెల్యేగా ఇక్కడి నుంచి గెలుపొందారు. 2014, 2019 ఎన్నికల్లో నందమూరి బాలకృష్ణ రెండు సార్లు గెలిచారు.

Tags

Read MoreRead Less
Next Story