Chandrababu: అమ్మఒడి ఇస్తూనే.. నాన్నబుడ్డి రూపంలో దోపిడీ

Chandrababu: అమ్మఒడి ఇస్తూనే.. నాన్నబుడ్డి రూపంలో దోపిడీ
ఇంట్లో ఎంత మంది విద్యార్థులుంటే అంత మందికీ అమ్మఒడి ఇస్తానని హామీ ఇచ్చిన జగన్‌ రెడ్డి ఇప్పుడు ఒక్కరికే ఇవ్వటం వివక్ష కాదా

ఇంట్లో ఎంత మంది విద్యార్థులుంటే అంత మందికీ అమ్మఒడి ఇస్తానని హామీ ఇచ్చిన జగన్‌ రెడ్డి ఇప్పుడు ఒక్కరికే ఇవ్వటం వివక్ష కాదాఅని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు . 300 యూనిట్ల విద్యుత్తు వాడారని, 75 శాతం హాజరు లేదని, ఇంట్లో వారికి కారు ఉందని సవాలక్ష కొర్రీల వేస్తున్నారంటూ మండిపడ్డారు. అమ్మఒడి ఇస్తూనే నాన్నబుడ్డి రూపంలో మీరు చేసే దోపిడీకి సమాధానం చెప్పగలరా అంటూ ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.

రాష్ట్రంలో 83 లక్షల మంది విద్యార్థులుంటే ఎంతమందికి అమ్మఒడి ఇస్తున్నారు. ఈ పథకం కింద లబ్ధిదారులకు ఇస్తున్నదెంత, కోతలు విధిస్తున్నది ఎంత,అంటూ ప్రశ్నించారు. విద్యారంగంపై జగన్‌ మాటలు కోటలు దాటుతున్నాయని విద్యా ప్రమాణాలు మాత్రం గడప దాటట్లేదంటూ ఎద్దేవా చేశారు. తాము అధికారంలోకి వచ్చాక ‘తల్లికి వందనం’ పేరుతో ఇంట్లో చదువుకునే పిల్లలందరికీ ఏడాదికి రూ.15 వేల చొప్పున ఇస్తామని ట్వీట్‌ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story