సీఎంకి 91 సీఆర్‌పీసీ ఇచ్చి ఆయన్నుంచి నిజాలు రాబట్టాలి : వర్ల రామయ్య
సీఎం జగన్ క్రైస్తవ సంఘాలను రెచ్చగొట్టి వారిని రోడ్లపైకి పంపిస్తున్నారన్నారు వర్ల రామయ్య.

X
Nagesh Swarna12 Jan 2021 12:00 PM GMT
దాడులకు పాల్పడిన వారి సమాచారం తన వద్ద ఉందన్నట్లు సీఎం జగన్ మాట్లాడారన్నారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య. సీఎం జగన్‌కు డీజీపీ 91 సీఆర్‌పీసీ ఇచ్చి నిజాలు రాబట్టాలని డిమాండ్ చేశారు. గతంలో చంద్రబాబుకు, తనకు నోటీసులిచ్చిన పోలీసులు.. సీఎం జగన్‌కు సైతం నోటీస్‌లు ఇవ్వాలన్నారు. సీఎంకు నోటీసులు ఇవ్వకుంటే పోలీసులు విచారణ జరిపే తీరు సరైంది కాదని భావిస్తామన్నారు. సీఎం జగన్ క్రైస్తవ సంఘాలను రెచ్చగొట్టి వారిని రోడ్లపైకి పంపిస్తున్నారని, రాజకీయ లబ్ధి కోసం వారిని సీఎం జగన్ వాడుకుంటున్నారన్నారు.
Next Story