AP : నాన్ లోకల్ అభ్యర్థుల అడ్డగా వైజాగ్

AP : నాన్ లోకల్ అభ్యర్థుల అడ్డగా  వైజాగ్

ఎన్నికల్లో కుల, మతాలే కాదు.. లోకల్, నాన్ లోకల్ అంశాలు కూడా గెలుపోటములను ప్రభావితం చేస్తాయి. ఎక్కువగా స్థానిక అభ్యర్థులనే ఓటర్లు ఎన్నుకోవడం సహజం. అయితే విశాఖ (Visakha) పార్లమెంట్ స్థానం దీనికి విరుద్ధం. 33 ఏళ్లుగా స్థానికేతరులే గెలుస్తున్నారు. 1952 నుంచి 1989 వరకు లోకల్ అభ్యర్థుల హవా కొనసాగగా, ఆ తర్వాతి నుంచి అన్ని పార్టీలూ నాన్ లోకల్స్‌కే సీట్లు ఇస్తున్నాయి.

విశాఖ ఎంపీ స్థానంలో తొలిసారి 1991లో నాన్ లోకల్ MVVS మూర్తి(తూర్పుగోదావరి) టీడీపీ నుంచి గెలిచారు. 1996, 1998లో కాంగ్రెస్ అభ్యర్థి సుబ్బరామిరెడ్డి(నెల్లూరు), 1999లో మళ్లీ MVVS మూర్తి, 2004లో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి-INC(నెల్లూరు), 2009లో దగ్గుబాటి పురందీశ్వరి-INC(ప్రకాశం), 2014లో కంభంపాటి హరిబాబు-BJP(ప్రకాశం), 2019లో MVV సత్యనారాయణ-YCP(వెస్ట్ గోదావరి) విజయం సాధించారు.

విశాఖ పార్లమెంట్ స్థానంలో ఈసారి వైసీపీ నుంచి బొత్స ఝాన్సీ, కూటమి నుంచి TDP అభ్యర్థిగా M.భరత్ పోటీ చేస్తున్నారు. వీరిద్దరూ కూడా స్థానిక అంశంతోనే బరిలో దిగుతున్నారు. తాను విజయనగరం కోడలు అయినప్పటికీ పుట్టినిల్లు విశాఖేనని ఝాన్సీ చెబుతున్నారు. గీతం వర్సిటీ సహా అనేక విద్యాసంస్థలను నెలకొల్పిన తాము కూడా విశాఖ వాసులమేనని భరత్ అంటున్నారు. దీంతో పోటీ రసవత్తరంగా ఉండనుంది.

Tags

Read MoreRead Less
Next Story