Google Play Store : ప్లేస్టోర్ నుంచి ఈ యాప్లను తొలగించిన గూగుల్

Google Play Store : ప్లేస్టోర్ నుంచి ఈ యాప్లను తొలగించిన గూగుల్

సెర్చ్ ఇంజిన్ గూగుల్ భారత్ లోని యూప్ డెవలపర్ల మధ్య ప్లే స్టోర్ ఛార్జీల వివాదం మరింత పెరిగింది. కొన్ని కంపెనీలు సర్వీస్ ఛార్జీలు చెల్లించ కుండా తమ బిల్లింగ్ నిబంధన లు పదే పదే ఉల్లంఘిస్తు న్నాయని పేర్కొంది. ఇలాం టి వాటిపై విధానపర మైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. గూగుల్ హెచ్చరించనట్లుగానే కొన్ని ప్రముఖ యాప్లను గూగుల్ తన ప్లేస్టోర్ నుంచి తొలగించడం ప్రారంభించింది. ఇలా తొలగించిన వాటిలో భారత్ మ్యాట్రిమోనీ యాప్తో పాటు ఆదిత్య కల్రా, మున్సిఫ్ వెంగట్టిల్, జాబ్ సెర్చ్ ఇంజిన్ యాప్ నౌక్రీడాట్ కామ్ ఉన్నాయి.

మొత్తం 10 సంస్థలకు చెందిన యాప్లు తమ నిబంధనలు పాటించడంలేదని గూగుల్ ఆరోపించింది. వీటిని తమ ప్లేస్టోర్ నుంచి తొలగిస్తామని హెచ్చరించింది. గూగుల్ యాప్ ఛార్జీల విధానాన్ని ఈ సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. కోర్టులో ఈ సంస్థలు పిటిషన్ వేసి, మధ్యంతర ఉత్తర్వులు పొందాయి. భారత్ మ్యాట్రిమోనికి చెందిన క్రిస్టియన్, ముస్లిం మ్యాట్రిమోని యాప్లను గూగుల్ తొలగించింది. 99 ఎకర్స్ యాప్తో పాటు, జోడీ యాప్ కూడా తొలగించిన వాటిలో ఉంది. భారత్ మ్యాట్రిమోనీ యాప్ను ఇప్పటి వరకు 5 కోట్ల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. ఈ మేరకు తమ బ్లాగ్ పోస్ట్ లో ప్రకటించింది.

భారత్లో 2 లక్షలకు పైగా డెవలపర్లు గూగుల్ ప్లే స్టోర్ను వినియోగిస్తున్నా రని, వీరంతా తమ పాలసీకి అనుగుణంగా వ్యవహరిస్తున్నారని తెలిపింది. 10 కంపెనీలు మాత్రం కొంత కాలంగా గూగుల్ ప్లేల్లో తాము అందిస్తున్న సర్వీస్లకు ఛార్జీలు చెల్లించడం లేదని, ఇందులో ప్రముఖ స్టార్టప్లు ఉన్నాయని తెలిపింది. కోర్టు నుంచి మధ్యంతర రక్షణ పొందుతూ ఈ కంపెనీలు నిబంధనలు ఉల్లంఘిస్తున్నా యని గూగుల్ తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story