Social Media : సేవలు నిలిచిపోతే ఇన్‌స్టా, ఫేస్ బుక్, వాట్సప్‌కు కోట్లలో నష్టం..

Social Media : సేవలు నిలిచిపోతే ఇన్‌స్టా, ఫేస్ బుక్, వాట్సప్‌కు కోట్లలో నష్టం..

ప్రపంచ వ్యాప్తంగా మనుషులంతా సోషల్ మీడియా యాప్స్ కు బానిసలయ్యారు. వాటిని చూడకుండా నిమిషం కూడా ఉండలేని పరిస్థితికి చేరుకున్నారు. ఆ మధ్య ఫేస్ బుక్ లో సాంకేతిక సమస్యలు ఏర్పడటంతో కొంతసేపు సేవలు నిలిచిపోయాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులు గగ్గోలు పెట్టారు. ట్విట్టర్ లో మార్క్ జుకర్ బర్గ్ ను ఒక ఆట ఆడుకున్నారు.

కొద్ది గంటల అంతరాయానికి ఫేస్ బుక్ వందల కోట్లు నష్టపోయిందని “రాయిటర్స్” తెలిపింది. ఫేస్ బుక్ సంగతి అలా ఉంటే.. దీని యాజమాన్యంలోని వాట్సాప్, ఇన్ స్టా గ్రామ్ సేవల్లో బుధవారం అంతరాయం ఏర్పడింది. గంటల తరబడి సేవల్లో స్తబ్దత ఏర్పడడంతో అమెరికా నుంచి ఇండియా వరకు వినియోగదారులు ఇబ్బంది పడ్డారు. భారతదేశంలో 30 వేలకు మందికి పైగా వినియోగదారులు వాట్సాప్ సేవలు నిలిచిపోయాయని.. ఇన్ స్టా గ్రామ్ లో అదే పరిస్థితి నెలకొందని తెలిపారు.

వాట్స్అప్ యాజమాన్యానికి 17,000 మంది వినియోగదారులు నేరుగా ఫిర్యాదులు చేశారు. డౌన్ డెటెక్టర్ నివేదిక ప్రకారం భారతదేశంలో 30 వేలమంది, ఇంగ్లాండ్ లో 67,000 మంది, బ్రెజిల్ దేశంలో 95,000 మంది వాట్సాప్ సేవలు నిలిచిపోవడంతో.. తమ ఫిర్యాదులను మెటా యాజమాన్యానికి నివేదించారు. అమెరికాలోని 3,200 మంది ఇన్ స్టా గ్రామ్ వాడడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు ఫిర్యాదులు చేశారు. ఇన్ని దేశాల్లో ఇన్ని కోట్లమందిని ప్రభావితం చేస్తున్న సోషల్ మీడియా సేవలు కొద్దిసేపు నిలిచిపోయినా.. వారి వ్యాపారం వందల కోట్లలో నష్టపోతుందని వార్తా సంస్థలు చెబుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story