Zomato : వెజ్ ఫ్లీట్ కోసం గ్రీన్ యూనిఫాం నిర్ణయం వెనక్కి తీసుకున్న జొమాటో

Zomato : వెజ్ ఫ్లీట్ కోసం గ్రీన్ యూనిఫాం నిర్ణయం వెనక్కి తీసుకున్న జొమాటో

జొమాటో (Zomato) సీఈవో దీపిందర్ గోయల్ (Deepinder Goyal) మాట్లాడుతూ ఫుడ్ డెలివరీ దిగ్గజం రైడర్‌లందరూ సాధారణ ఎరుపు రంగు టీ-షర్టులను ధరిస్తారు. కొత్తగా ప్రవేశపెట్టిన 'ఆల్-వెజ్' సర్వీస్ భారీ ఆన్‌లైన్ చర్చకు దారితీసింది. ఈ చర్యను పలువురు విమర్శించారు. దీంతో తాజాగా ఆ కంపెనీ సీఈవో ఈ నిర్ణయం వెల్లడించారు.

"మేము శాకాహారుల కోసం ఫ్లీట్ ఫర్ వెజిటేరియన్స్ ను కొనసాగించబోతున్నాము. రైడర్స్ కోసం ఉద్దేశించిన ఆకుపచ్చ రంగును తొలగించాలని నిర్ణయించుకున్నాము. మా రైడర్లందరూ.. మా రెగ్యులర్ ఫ్లీట్ కు ఎరుపు రంగు వలే.. శాకాహారుల కోసం ఏర్పాటు చేసిన ఫ్లీట్ కోసమూ రైడర్స్ ఎరుపు రంగు యూనిఫాంనే ధరిస్తారు”అని గోయల్ ఎక్స్‌లో పోస్ట్‌లో తెలిపారు.

అంతకుముందు, శాకాహార ఆహార ప్రాధాన్యత కలిగిన కస్టమర్ల కోసం మార్చి 19న ప్రవేశపెట్టిన కొత్త 'ప్యూర్ వెజ్ ఫ్లీట్' డెలివరీ రైడర్‌లు ఆకుపచ్చ యూనిఫాం ధరించాలి. యాప్‌లోని 'ప్యూర్ వెజ్' మోడ్ స్వచ్ఛమైన శాఖాహార ఆహారాన్ని మాత్రమే అందించే రెస్టారెంట్‌ల క్యూరేషన్‌ను కలిగి ఉంది. ఇది ఏదైనా నాన్-వెజ్ ఫుడ్ ఐటమ్స్ అందించే అన్ని రెస్టారెంట్‌లను మినహాయిస్తుంది.

Tags

Read MoreRead Less
Next Story