Kannappa : మంచు విష్ణు, ప్రభాస్ భక్త 'కన్నప్ప'లో బాలయ్య! పాత్రేంటో తెలుసా?

Kannappa : మంచు విష్ణు, ప్రభాస్ భక్త కన్నప్పలో బాలయ్య! పాత్రేంటో తెలుసా?

క్రేజీ కాంబినేషన్ తో టాలీవుడ్ లో బజ్ క్రియేట్ చేసింది మంచు విష్ణు (Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్ మూవీ కన్నప్ప. సినిమా ఇటీవల సెట్స్‌ పైకి వచ్చింది. నేషనల్ వైడ్ మార్కెట్ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా భారీ డివోషనల్ మూవీగా తెరకెక్కుతోంది. మూవీలో మంచు విష్ణు టైటిల్ రోల్ కన్నప్ప (Kannappa) పాత్రలో కనిపించనున్నాడు. అతనితోపాటు సినిమాలో భారీ తారాగణం నటించడంతో సినిమాకు మరింత హైప్‌ పెరుగుతుంది.

ప్రభాస్, శివరాజ్ కుమార్, మోహన్ లాల్, మోహన్ బాబు లాంటి స్టార్ హీరోలంతా ఇందులో భాగమయ్యారు. లిస్టులో నందమూరి బాలకృష్ణ కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఓ పాత్రకు బాలకృష్ణ అయితేనే కచ్చితంగా సెట్ అవుతాడని మేకర్స్ భావించారట. మంచు విష్ణు, మోహన్ బాబు స్వయంగా వెళ్లి బాలయ్యను కలిసి స్టోరీ చెబుతారని తెలుస్తోంది. పౌరాణిక పాత్రలంటే అమితంగా ఇష్టపడే బాలయ్య దీనికి ఎస్ చెబుతాడనే అంతా అనుకుంటున్నారు.

బాలయ్యను రావణబ్రహ్మ పాత్ర కోసం అడగబోతున్నారని సినీవర్గాల సమాచారం. సినిమాలో ఉండేది కొద్దిసేపే అయినా ఆ పాత్రకు ఉండే పవర్ ఫుల్ ప్రెజెన్స్ కు బాలయ్య కరెక్ట్ అంటున్నారు మేకర్స్. కచ్చితంగా బాలయ్య కన్నప్పలో రావణబ్రహ్మగా కనిపిస్తే సినిమా క్రేజ్ వేరే లెవెల్ కు వెళ్లి పోతుంది అనడంలో వేరే సందేహమే అక్కర్లేదు.

Tags

Read MoreRead Less
Next Story