Prabhas Marriage : ప్రభాస్ పెళ్లిపై గోపీచంద్ ఇంట్రస్టింగ్ కామెంట్స్ వైరల్

Prabhas Marriage : ప్రభాస్ పెళ్లిపై గోపీచంద్ ఇంట్రస్టింగ్ కామెంట్స్ వైరల్

ఫిలిం ఇండస్ట్రీలో కొన్ని ఇష్యూస్ ఎవర్ గ్రీన్. ఎప్పుడూ వాటిపై చర్చ జరుగుతూ ఉంటుంది. సల్మాన్ పెళ్లి.. రేఖ ఎఫైర్లు.. సావిత్రి జీవితం.. తాజాగా ప్రభాస్ మ్యారేజ్. ఇలాంటివాటి గురించి ఏం రాసినా చదువుతారు. మూవీ గోయర్స్ ఏ నలుగురు కలిసినా డిస్కస్ చేస్తారు.

ఇండస్ట్రీలో మంచి ఫ్రెండ్స్ ప్రభాస్, గోపీచంద్. వర్షం సినిమాలో ఇద్దరూ కలసి నటించారు. తర్వాత మళ్ళీ తెర పంచుకోలేదు. ఈ ఇద్దరూ కలసి సినిమా చేయాలని ఫ్యాన్స్ నుంచి డిమాండ్ వుంది. సలార్ లో వరద పాత్రలో గోపిచంద్ వుంటే సినిమాలో ఎమోషన్ ఇంకా బలంగా ఉండేదని అభిప్రాయపడిన అభిమానులు కూడా వున్నారు. ఎప్పుడు మీడియా ముందుకు వచ్చిన వారికి ఈ ప్రశ్న ఎదురౌతుంది.

తాజాగా గోపిచంద్, ప్రభాస్ తో సినిమా గురించి స్పందించారు. భీమా ప్రమోషన్ లో బిజీగా ఉన్న గోపీచంద్.. 'నేను, ప్రభాస్ కలసి సినిమా చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాం. దానికి సమయం రావాలి. సినిమా మాత్రం తప్పకుండా చేస్తాం'అని చెప్పారు. ఇదే సందర్భంలో ప్రభాస్ కి పెళ్లి ఎప్పుడనే ప్రశ్న కూడా గోపీచంద్ ను అడిగారు. అందుకు 'నో కామెంట్స్' అని నవ్వేశారు. దీనిపైనా అనేక విశ్లేషణలు జరుగుతున్నాయి. ప్రభాస్ ఇప్పుడు కెరీర్ పీక్స్ లో ఉన్నాడని.. ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదని గోపిచంద్ మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు.

Tags

Read MoreRead Less
Next Story