Kalki : కల్కి టైటిల్ వెనుక అసలు కథ ఇది

Kalki : కల్కి టైటిల్ వెనుక అసలు కథ ఇది

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) సలార్ మరోసారి భారీ విజయాన్ని నమోదు చేశారు. ఇప్పుడు ఆయన నటిస్తున్న కల్కి 2898 ఏడి చిత్రంపై (Kalki) అందరి దృష్టి నిలిచింది. మహానటి ఫేమ్ నాగఅశ్విన్ రూపొందిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమలహాసన్, దీపికా పదుకొనె వంటి స్టార్స్ నటిస్తున్నారు. కల్కి చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.

మరో ప్రపంచాన్ని దర్శకుడు సృష్టిస్తున్నారని. ఇండియాలోనే ఈ తరహా చిత్ర నిర్మాణం. జరగడం తొలిసారి అని సినీ పరిశీలకులు అంటున్నారు. వ్యయం సైతం భారీగానే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు నాగ అశ్విన్ ఓ ఇంటర్యూలో ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ముఖ్యంగా కల్కి అనే టైటిల్ నిర్ణయించడానికి కారణం కూడా ఉదహరించారు.

చిత్ర కథ మహాభారతం కాలం నుండి ప్రారంభమవుతుందని, 2898తో పూర్తవుతుందని చెప్పారు. అంటే గతంతో మొదలెట్టి భవిష్యత్తులో ముగుస్తుంది. అందుకే కల్కి అనే టైటిల్ పెట్టడం జరిగింది. చిత్ర కథనం మొత్తం ఆరు వేల సంవత్సరాల మధ్య జరుగుతుందని, దానికి తగినట్టుగా కొత్త ప్రపంచాన్ని సృష్టించిన నట్టుగా తెలిపారు. కొత్త ప్రపంచంలో భారతీయత కనిపించేలా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు.

Tags

Read MoreRead Less
Next Story