Prabhas Cousin : ప్రభాస్ కజిన్ వస్తున్నాడు.. కృష్ణంరాజు ఫ్యామిలీ నుంచి మరో హీరో

Prabhas Cousin : ప్రభాస్ కజిన్ వస్తున్నాడు.. కృష్ణంరాజు ఫ్యామిలీ నుంచి మరో హీరో

కృష్ణంరాజు సినీ ఇండస్ట్రీలో సొంతంగా ఎదిగిన హీరో. రెబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్నారు ఈ నటుడు. రెబల్ స్టార్ (Rebel Star) ఇంటి నుంచి వచ్చిన ప్రభాస్‌ పాన్ ఇండియా స్టార్ గా మారారు. ఇండియాకే ఓ ఐకన్ గా మారారు. అదే ఫ్యామిలీ నుంచి ఇప్పుడు మరో హీరో ముందడుగు వేశాడు.

అతడి పేరు విరాట్ రాజ్‌. కృష్ణంరాజుకి దూరపు చుట్టం. ప్రభాస్‌కు సోదరుడి వరుస. తను కథానాయకుడిగా 'గౌడ్ సాబ్‌' అనే సినిమా ఈరోజు పట్టాలెక్కింది. కొరియోగ్రాఫర్‌గా పేరు తెచ్చుకొన్న గణేష్ మాస్టర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

ప్రభాస్ 'రాజా సాబ్' అనే సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు గౌడ్ సాబ్ వస్తోంది. అలా.. ఈ రెండు సినిమాలకు పోలిక ఉండేలా చూసుకున్నారు మేకర్స్. విరాట్ రాజ్ లుక్స్ బాగున్నాయనీ.. ప్రభాస్ లా.. హైట్ ఉన్నాడనీ అంటున్నారు. మాస్, యాక్షన్ సినిమాలకు సెట్ అవుతాడని చెబుతున్నారు. చూడాలి.. మొదటి సినిమా వస్తేగానీ ఓ అంచనాకు రాలేం. ఉగాది రోజున హైదరాబాద్ లో ఈ చిత్ర షూటింగ్ ను లాంఛనంగా క్లాప్ కొట్టి సుకుమార్ ప్రారంభించారు. విరాట్ రాజ్‌ని ఆశీర్వదించాడు.

Tags

Read MoreRead Less
Next Story