Raja Saab : ది రాజా సాబ్ షూటింగ్ లో జాయిన్ కానున్న ప్రభాస్

Raja Saab : ది రాజా సాబ్ షూటింగ్ లో జాయిన్ కానున్న ప్రభాస్

ఇటీవలే సాలార్ తో సక్సెస్ అందుకున్న రెబెల్ స్టార్ ప్రభాస్ (Prabhas).. ఇప్పుడు ఆయన ఖాతాలో ఎన్నో భారీ సినిమాలను కలిగి ఉన్నాడు. అందులో కల్కి 2898 కూడా ఉండగా.. ఇది ఈ ఏడాది మేలో విడుదల కానుంది. దీంతో పాటు సాలార్ 2, స్పిరిట్, రాజా సాబ్ వంటి మూవీస్ కూడా బ్యాక్ టూ బ్యాక్ రిలీజ్ కానున్నట్టు సమాచారం. అయితే తాజా అప్ డేట్ ప్రకారం, ఇప్పటికే పలు సినిమాల షూటింగుల్లో బిజీగా ఉన్న ప్రభాస్.. కొత్తగా మరో మూవీ షూట్ లో జాయిన్ అవబోతున్నాడనే టాక్ వినిపిస్తోంది.

ప్రస్తుతం ప్రభాస్ కల్కి 2898తో పాటు సందీప్ రెడ్డి వంగా డెరెక్ట్ చేస్తోన్న స్పిరిట్ షూటింగ్ లో త్వరలోనే జాయిన్ కానున్నట్టు ఇటీవలే ప్రకటించారు. ఇక ఇంతలోనే ఆయన మూడో మూవీకి సంబంధించి ఓ క్రేజీ అప్ డేట్ వైరల్ అవుతోంది. సాలార్ 2, స్పిరిట్ మూవీస్ తో పాటు ప్రభాస్ ది రాజా సాబ్ అనే మూవీ షూటింగ్ లోనూ చేరనున్నట్టు తెలుస్తోంది.

ది రాజా సాబ్ అనే మూవీని దర్శకుడు మారుతీ తెరకెక్కిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రివీల్ చేయగా.. అందులో ప్రభాస్ లుంగీ కట్టుకుిన కనిపించాడు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీలోనూ జనవరి 15, 2025న రిలీజ్ చేయనున్నట్టు సమాచారం. ఇక ఈ మూవీ షూటింగ్ ను జూన్ లేదా జులైలో ప్రారంభించే అవకాశాలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్టుగా సాగితే వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అవుతుంది.

Tags

Read MoreRead Less
Next Story