Salaar 2 Update : సలార్ 2 క్రేజీ అప్డేట్.. ప్రభాస్ సరసన కియారా అద్వానీ?

Salaar 2 Update : సలార్ 2 క్రేజీ అప్డేట్..  ప్రభాస్ సరసన కియారా అద్వానీ?

రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి గతేడాది వచ్చిన హిట్ మూవీ సలార్. దానికి సీక్వెల్ గా సలార్ 2 (శౌర్యంగపర్వం) టైటిల్ తో రాబోతోంది. ఈ ఏడాదిలోనే ప్రశాంత్ నీల్ ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. వచ్చే ఏడాది ఆగష్టులోపు రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. సలార్-2లో శృతి హాసన్ తో పాటు మరో హీరోయిన్ ఉంటుందనే టాక్ నడుస్తోంది.

ఈ రోల్ కోసం బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీని సంప్రదిస్తున్నారంటూ వార్తలొస్తున్నాయి. దీనిపై ఇప్పటి వరకు చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి క్లారిటీ లేదు. ఈ మూవీ కథ మేగ్జిమమ్ ఖాన్సార్ సిటీలోనే నడవబోతోందట. అక్కడ తన ప్రాణ స్నేహితుడితో ప్రభాస్ కి వైరం ఎలా వచ్చింది. శౌర్యంగ వంశం ఉనికిని ఎలా తెలియజేశారు..? అనే అంశాలు సలార్ 2లో ప్రశాంత్ నీల్ చూపించబోతున్నాడట.

నిజంగా ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్ గా ఉంటే మాత్రం కచ్చితంగా సినిమాకి అదనపు ఆకర్షణ అనే చెప్పవచ్చు. సలార్ 2 మీద హైప్కి ఇది కూడా తోడవుతుందని అంచనా వేస్తున్నారు. కేజీఎఫ్ చాప్టర్ 2 కలెక్షన్స్ని సలార్ 2 బ్రేక్ చేసే అవకాశం

ఉంటుందనే అంచనాలున్నాయి. ఇక ప్రభాస్ మరో వైపు కల్కి సినిమాను ఇప్పటికే ఫినిష్ చేశాడు. మారుతి రాజా సాబ్ షూట్ మూవీ మరో 10 రోజుల్లో ఫినిష్ అవుతుంది.

Tags

Read MoreRead Less
Next Story