Salaar Sequel : ప్రభాస్ ఫ్యాన్స్ కు సూపర్ న్యూస్.. సలార్ సీక్వెల్‌లో అదిరిపోయే ట్విస్ట్

Salaar Sequel : ప్రభాస్ ఫ్యాన్స్ కు సూపర్ న్యూస్.. సలార్ సీక్వెల్‌లో అదిరిపోయే ట్విస్ట్

ఇండియా సినీ పరిశ్రమలో ప్రభాస్ (Prabhas) ఓ పెను సంచలనం. సలార్‌ (Salaar) సినిమాతో రూ.800 కోట్ల కలెక్షన్ రాబట్టి భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న ప్రభాస్.. ప్రస్తుతం వరుస సినిమాలను రూపొందిస్తూ బిజీగా గడుతున్నాడు. ప్రస్తుతం రాజా సాబ్‌, కల్కి సినిమాల్లో బిజీగా ఉన్న డార్లింగ్.. ఈ సంవత్సరం ఈ రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి.. మరోసారి రికార్డులు బ్రేక్ చేయాలని ప్రయత్నిస్తున్నాడు.

ప్రభాస్ తో సలార్ 2 తోపాటు.. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఎన్టీఆర్ తో సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా పనుల్లో ప్రశాంత్ బిజీగా ఉండడం వల్ల ప్రభాస్ తో సలార్ 2ను.. ఎన్టీఆర్ సినిమా పూర్తయిన తర్వాతే రూపొందిస్తాడంటూ తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా కోసం చాలామంది ప్రేక్షకులు ఇంట్రస్టింగ్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాను ప్రశాంత్ నీల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నాడు.

ప్రశాంత్ నీల్‌ సినిమాల్లో శృతిహాసన్‌కు సంబంధించి ఓ భారీ ట్విస్ట్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. పార్ట్ 1లో హీరోయిన్ గా చాలా కామ్ గా కనిపించిన శృతిహాసన్.. పార్ట్ 2 లో మాత్రం డిఫరెంట్ షేడ్స్ తో కనిపించనుందట. ఆమెను లండన్ నుంచి ఇండియా రావడానికి కూడా సపరేట్ కారణం ఉందని.. ఆ ట్విస్ట్ సలార్‌2లో ఏంటో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. సలార్ 2 ఫస్ట్ పార్ట్ ను మించి ఉంటుందని ఇప్పటికే ప్రభాస్ చెప్పాడు. బాహుబలి 1 ని మించి బాహుబలి 2 ఉన్నట్టు సలార్ 2 పైన కూడా భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.

Tags

Read MoreRead Less
Next Story