Groom : డెంటల్ క్లినిక్‌లో పెళ్లి కొడుకు మృతి

Groom : డెంటల్ క్లినిక్‌లో పెళ్లి కొడుకు మృతి

హైదరాబాద్‌లోని (Hyderabad) ఓ డెంటల్ క్లినిక్‌లో తన పెళ్లికి సిద్ధమవుతున్న 28 ఏళ్ల యువకుడు అనస్థీషియా ఓవర్ డోస్ కారణంగా మరణించాడు. ఈ సంఘటన ఫిబ్రవరి 16న ఆ వ్యక్తి తన పెళ్లికి ముందు తన చిరునవ్వును పెంచుకునే ప్రక్రియ కోసం డెంటల్ క్లినిక్‌ని సందర్శించినప్పుడు జరిగింది. మృతుడు లక్ష్మీ నారాయణ్‌గా (Lakshmi Narayan) గుర్తించారు. అతను 'స్మైల్ డిజైనింగ్' ప్రక్రియ కోసం క్లినిక్‌కి వెళ్లినట్లు సమాచారం.

అదేరోజు సాయంత్రం నారాయణ్ తండ్రి వింజం రాములు తన కొడుకు ఫోన్‌కి కాల్ చేయగా, క్లినిక్ సిబ్బంది స్పందించారు. ఈ క్రమంలో కొడుకు స్పృహ తప్పి పడిపోయాడని వారు నారాయణ్ తండ్రికి సమాచారం అందించారు. నారాయణ్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, అక్కడికి చేరుకునేలోపే మృతి చెందినట్లు అతని కుటుంబ సభ్యులు తెలిపారు.

ఈ ఘటనపై యువకుడి కుటుంబం దంత వైద్యశాలపై ఐపీసీ సెక్షన్ 304A (నిర్లక్ష్యం వల్ల మరణానికి కారణం) కింద ఫిర్యాదు చేసింది. నారాయణ్‌కు మత్తుమందు ఎక్కువగా అందించారని, అది అతని మరణానికి దారితీసిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. క్లినిక్‌లోని సీసీటీవీ ఆధారాలను సేకరించిన పోలీసులు కేసు తదుపరి విచారణ చేపట్టారు.

Tags

Read MoreRead Less
Next Story