ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం..!

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై గేదె కళేబరంపై ఎక్కడంతో ఆటో బోల్తా పడింది. దీంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు.

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం..!
X

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై గేదె కళేబరంపై ఎక్కడంతో ఆటో బోల్తా పడింది. దీంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. తుర్లుపాడు మండలం రోలుగుంపాడు ఎస్టీ కాలనీ సమీపంలో ఈ ఘటన జరిగింది. దీంతో పోలీసులు క్షతగాత్రులను మార్కాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతులు శారమ్మ, మార్తమ్మ, లింగమ్మ, వెంకటేశ్‌రెడ్డిగా గుర్తించారు. ప్రమాద సమయంలో ఆటోలో 14 మంది ప్రయాణికులు ఉన్నారు. బెస్తవారిపేట మండలం కొత్తపల్లి కార్యక్రమానికి వెళ్లివస్తుండగా ఈ ఘటన జరిగింది.

Next Story

RELATED STORIES