Ayodhya : అయోధ్య రాముడికి బంగారు 'రామాయణం' కానుక

Ayodhya : అయోధ్య రాముడికి బంగారు రామాయణం కానుక

శ్రీరామ నవమి అద్భుతం అనిపించేలా సాగేందుకు సమయం సిద్ధమవుతోంది. నవ భారత చరిత్రలో ఏనాడూ లేనిరీతిలో అయోధ్య రామయ్య కొలువయ్యాక వస్తున్న తొలి శ్రీరామనవమి ఇది కావడంతో.. జనం శ్రీరామ నవమికి భక్తి పారవశ్యంతో సిద్ధమవుతున్నారు. అటు అయోధ్యలో రామయ్యకు కానుకల సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోతోంది.

విశ్రాంత​ ఐఏఎస్​ అధికారి లక్ష్మీనారాయణ్ రూ.5 కోట్లతో తయారు చేయించిన 7 కిలోల బరువున్న 'బంగారు రామాయణం' గ్రంథాన్ని కానుకగా ఇచ్చారు. అయోధ్యలోని బాలక్​రామ్​ గర్భ గుడిలో దీనిని ప్రతిష్ఠించారు. ఈ గ్రంథంలో 500 బంగారు పేజీలు, 10,902 శ్లోకాలు ఉన్నాయి. అయోధ్య రామమందిరం గర్భగుడిలో భగవాన్ శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ సమయంలో విశ్రాంత​ ఐఏఎస్​ అధికారి లక్ష్మీనారాయణ్​ తన జీవిత సంపాదన మొత్తాన్ని రాంలాల్లాకు అంకితం చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. ఆ మాటప్రకారమే ఆయన ఈ స్వర్ణ పుస్తకాన్ని తయారుచేయించారు.

గ్రంథంలోని ప్రతి పేజీపై 24 క్యారెట్ల బంగారు పూతపూశారు. దీని తయారీలో 140 కిలోల రాగిని కూడా వాడారు. ఈనెల 17న శ్రీరామ నవమికి ఇది మరో ప్రత్యేక ఆకర్షణ కానుంది.

Tags

Read MoreRead Less
Next Story