TTD : తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ .. ఎందుకంటే?

TTD : తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ .. ఎందుకంటే?

కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. టైమ్ స్లాట్ దర్శనానికి భక్తులు రెండు కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. దర్శన టికెట్లు లేని భక్తులకు 8 గంటల్లో దర్శనం అవుతోంది. రూ.300 స్పెషల్ ఎంట్రీ టికెట్లు ఉన్న భక్తులకు 3 గంటలు పడుతోంది. నిన్న 64వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. 25,773 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 2.66 కోట్లు సమర్పించారు.

భక్తుల రద్దీ తగ్గడానికి కారణాలు చాలానే ఉన్నాయి. ఎన్నికల సీజన్‌ కావడంతో సిఫార్సు లేఖల్ని టీటీడీ అనుమతించడం లేదు. దీంతో చాలామంది తిరుమల పర్యటన వాయిదా వేసుకుంటున్నారు. ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనడంతో కొంతమంది, ఎన్నికల సమయంలో ప్రయాణాలు ఎందుకని మరికొందరు వాయిదా వేసుకుంటున్నారు. ఈ క్రమంలో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య 20 రోజులుగా తగ్గింది.

గతేడాది ఏప్రిల్‌ 1 నుంచి 23వ తేదీ వరకు పరిశీలిస్తే దాదాపు 16,51,341 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి 23వ తేదీ వరకు 15 లక్షల మంది భక్తులే శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రత్యేకించి వేసవి సెలవుల్లో శ్రీవారిని సగటున రోజుకు 70 నుంచి 80 వేల మంది దర్శించుకుంటారు. వారాంతాల్లో అయితే 90 వేల వరకు ఆ సంఖ్య పెరుగుతుంది. కానీ పదిరోజులుగా సగటున 60 వేలమంది మాత్రమే దర్శించుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story