Vemulavada Temple : వేములవాడ రాజన్నకు రికార్డు స్థాయి ఆదాయం

Vemulavada Temple : వేములవాడ రాజన్నకు రికార్డు స్థాయి ఆదాయం

వేములవాడ రాజన్న ఆలయానికి 2023-24లో రూ.119.72 కోట్ల రికార్డు స్థాయి ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది మేడారం జాతర రావడంతో ఆలయానికి భక్తుల తాకిడి పెరిగి మంచి ఆదాయం సమకూరిందని చెప్పారు. 2021-22లో అత్యధికంగా రూ.87.78 కోట్లు రాగా, ఈసారి అదనంగా రూ.31 కోట్ల ఆదాయం వచ్చింది. హుండీ ద్వారా రూ.32 కోట్లు, ప్రసాదాల ద్వారా రూ.21 కోట్లు, టికెట్ల విక్రయంతో రూ.22 కోట్లు సమకూరింది.

అయితే.. ఈ ఆదాయంలో సింహభాగం హుండీ ద్వారా రూ.32.74 కోట్లు వచ్చినట్టు ఈవో తెలిపారు. ప్రసాదాల విక్రయం ద్వారా రూ.21.81కోట్లు సమకూరగా.. కోడె టికెట్ల విక్రయం ద్వారా రూ.22 కోట్లు వచ్చినట్టు పేర్కొన్నారు.

ఇక లీజులు, లైసెన్స్‌ల ద్వారా రూ.15.50 కోట్లు, వడ్డీల ద్వారా రూ.5.55 కోట్లు, ధర్మశాలల ద్వారా రూ.4.36కోట్లు, కళ్యాణం టికెట్ల ద్వారా రూ.3.55 కోట్లు, అభిషేకం టికెట్ల విక్రయం ద్వారా రూ.2.79 కోట్లు, శీఘ్రదర్శనం టికెట్ల ద్వారా రూ.2.37 కోట్లు, కేశఖండనం టికెట్ల ద్వారా రూ.2.13 కోట్ల ఆదాయం వచ్చిందని.. ఇతరత్రా వాటి ద్వారా రూ.6.92 కోట్ల ఆదాయం లభించిందని.. ఈవో చెప్పుకొచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story