TS : మేడారం యాప్‌ ఇంకా అప్డేట్‌ కాలే

TS : మేడారం యాప్‌ ఇంకా అప్డేట్‌ కాలే

మేడారం (Medaram) మహాజాతరకు సంబంధించిన అధికారిక పోర్టల్‌ ఇంకా అప్డేట్‌ కాలేదు. పాత వివరాలే ఇంకా దర్శనమిస్తున్నాయి. జాతర ప్రాముఖ్యత, తేదీలు, ఆన్‌లైన్‌ దర్శనం, ప్రసాదం సేవలు తదితర అంశాలు పాతవే కనిపిస్తున్నాయి. గూగుల్‌లో మేడారం జాతర అని సర్చ్‌ చేస్తే ముందుగా కనిపించేది ఈ వెబ్‌సైటే. సర్చ్‌ ఇంజన్‌ ఆప్టిమైజేషన్‌లో ఇది మొదటి స్థానంలో ఉంది. అంతటి ప్రాధాన్యమున్న ఈ సైటులో ప్రస్తుత జాతర వివరాలు అప్డేట్‌ చేయకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు సమ్మక్క-సారలమ్మ జాతర (Samakka Saralamma Jatara) జరగనుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈసారి జాతరకు కోటి 50 లక్షల మంది భక్తులు వస్తారని.. అధికారులు అంచనా వేస్తున్నారు. స్థానిక మంత్రి, ఆదివాసి బిడ్డ సీతక్క అన్ని తానై మేడారం సమ్మక్క సారక్క జాతరకు ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. డారం చుట్టూ 8 కిలోమీటర్ల మేర 33 ప్రాంతాల్లో పార్కింగ్‌కు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ బస్సుల కోసం ప్రత్యేక బస్టాండ్‌తో పాటు.. 14 వేల మంది పోలీసులు, 500 సీసీ కెమెరాలు, 12 డ్రోన్ కెమెరాలతో భద్రతా ఏర్పాట్లు చేశారు.

మేడారం జాతర నేపథ్యంలో ఆర్టీసీ (RTC) వేలాది ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఈ బస్సులను ఆదివారం నుంచి ఫిబ్రవరి 25 వరకు నడిపించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 51 పాయింట్ల నుంచి, ఉమ్మడి వరంగల్​జిల్లాలో 18 ప్రాంగణాల నుంచి ప్రత్యేకంగా 6000 బస్సులను నడిపిస్తోంది. ఈ ప్రత్యేక బస్సులను ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా బస్సులను నడిపేందుకు ఆర్టీసీ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story