Badrachalam: భద్రాద్రి సీతారాముల కల్యాణానికి సిరిసిల్ల చీర

Badrachalam: భద్రాద్రి సీతారాముల కల్యాణానికి సిరిసిల్ల చీర

భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణానికి సిరిసిల్లకు చెందిన నేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ పట్టు చీరను సిద్ధం చేశారు. సీతారాముల కల్యాణానికి సిరిసిల్ల సీతమ్మ కల్యాణం చీర ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఇస్తున్న వెల్ది హరిప్రసాద్ ఈసారి మరో అద్భుతమైన చీరను చేనేత మగ్గంపై సీతారాముల కల్యాణం వచ్చేలా రూపొందించారు.

అలాగే అంచులు (బార్డర్లు) భద్రాద్రి దేవాలయంలో ఉన్న సీతారాముల ప్రతిరూపాలు వచ్చేలా చీర మొత్తం శంఖు చక్ర నామాలు చీరపై బార్డర్ లో "జై శ్రీరామ్" అంటూ వచ్చేలా ఆరు రోజులపాటు శ్రమించి ఈ చీరను చేనేత మగ్గంపై నేశాడు. ఈ చీర బరువు 800 గ్రాములు ఉంటుంది.

ఇందులో రెండు గ్రాముల బంగారం, 150 గ్రాముల వెండి, పట్టుదారాలతో నేశాడు. చీర కొంగులో సీతారాముల కల్యాణం బొమ్మ నేయడం విశేషం. కాగా, దీనిని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖకు చూపి, సీతారాముల కల్యాణానికి అందిస్తానని వెళ్లి హరిప్రసాద్ వెల్లడించారు.

అయోధ్య రామయ్య సీతమ్మ కోసం సిరిసిల్ల చేనేత కార్మికుడు వెల్ది హరిప్రసాద్ దంపతులు గతంలో బంగారు చీర అందించారు. నేడు భద్రాచలం సీతమ్మకు బంగారు చీరను నేశారు. 8 గ్రాముల బంగారం, 20 గ్రాముల వెండితో 20 రోజులు శ్రమించి అయోధ్యలో బాలరాముడు విగ్రహ ప్రాణప్రతిష్ట సమయంలో బంగారు చీరను తయారు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story