Yama Dharmaraju Temple : యమ ధర్మరాజుకి ఆలయం ఎక్కడో తెలుసా?

Yama Dharmaraju Temple : యమ ధర్మరాజుకి ఆలయం ఎక్కడో తెలుసా?

దేవాలయాలకు ప్రసిద్ధి అయిన మన దేశంలో మృత్యుదేవుడైన యమరాజుకీ ఆలయం ఉంది. ధర్మేశ్వర మహాదేవ అని పిలిచే ఈ ఆలయం హిమాచల్‌ప్రదేశ్‌లోని చంబా(D) భర్మోర్‌లో ఉంది. చనిపోయిన వారి ఆత్మలన్నీ ఇక్కడికి చేరుకున్న తర్వాతే ఈ లోకాన్ని విడిచిపెడతాయని స్థానికుల నమ్మకం. చాలా మంది ఇక్కడికి వచ్చేందుకు భయపడతారట. ఎవరైతే భయం లేకుండా వచ్చి పూజిస్తారో వారికి అకాల మరణం ఉండదని అంటుంటారు. ఇక్కడ చిత్రగుప్తుడికీ ప్రత్యేక గది ఉంది.

ఈ ఆలయం సాధారణ ఇల్లులా కనిపిస్తుంది. అయితే ఈ దేవాలయకు ప్రత్యేకత ఉంది. ఈ ఆలయంలో ఒక ఖాళీ గది ఉంది. ఆ గది చిత్రగుప్తుని గది అని నమ్ముతారు. చిత్రగుప్తుడు యమధర్మ రాజు ప్రధాన కార్యదర్శి. చిత్ర గుప్తుడు ఆత్మ గల మనిషి చేసిన కర్మల గురించి లెక్కించి ఉంచుతాడు. ఎవరైనా మరణించిన అనంతరం యమభటులు ఆ వ్యక్తి యొక్క ఆత్మను పట్టుకుని, ముందుగా ఈ ఆలయంలో చిత్రగుప్తుని ముందు ఉంచుతారని నమ్ముతారు.

ఇక్కడ యమరాజు తన నిర్ణయాన్ని కర్మలను బట్టి ఆత్మకు చెబుతాడని అంటారు. ఈ ఆలయంలో బంగారం, వెండి, రాగి, ఇనుముతో చేసిన నాలుగు అదృశ్య తలుపులు ఉన్నాయని కూడా విశ్వాసం. యమధర్మ రాజు నిర్ణయం తర్వాత యమదూతలు ఆత్మను దాని కర్మల ప్రకారం ఈ ద్వారాల ద్వారా స్వర్గానికి లేదా నరకానికి తీసుకువెళతారు.

Tags

Read MoreRead Less
Next Story