Coronavirus: భారత్‌లో తొలి డబుల్ ఇన్ఫెక్షన్..

Coronavirus: భారత్‌లో తొలి డబుల్ ఇన్ఫెక్షన్..

Coronavirus Represntional Image

Covid variant: దేశంలో కోవిడ్‌ కేసులు టెన్షన్‌ పుట్టిస్తున్నాయి. మళ్లీ పెరుగుతున్న కేసులు థర్డ్‌ వేవ్‌ భయాన్ని మరింత పెంచుతున్నాయి.

Covid 19: దేశంలో కోవిడ్‌ కేసులు టెన్షన్‌ పుట్టిస్తున్నాయి. మళ్లీ పెరుగుతున్న కేసులు థర్డ్‌ వేవ్‌ భయాన్ని మరింత పెంచుతున్నాయి. మరోవైపు కొత్తగా పుట్టుకొస్తున్న కరోనా రకాలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఈ తరుణంలో దేశంలో తొలి డబుల్ ఇన్ఫెక్షన్ కేసు నమోదైంది. అస్సాంకు చెందిన ఓ మహిళా వైద్యురాలికి ఒకేసారి ఆల్ఫా, డెల్టా వేరియంట్లు సోకినట్లు నిర్ధారించారు. దీనిని దేశంలో తొలి డబుల్ ఇన్ఫెక్షన్ కేసుగా వైద్య నిపుణులు అంచనాకు వచ్చారు.

ప్రస్తుతం బాధితురాలి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉనట్లు తెలుస్తోంది. స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయి. హోం ఐసోలేషన్‌లో డాక్టర్ల పర్యవేక్షణలో ఆమె ఉంది. అలాగే ఆమె కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు కూడా వేయించుకున్నారు. అటు ఆమె భర్త మొదట ఆల్ఫా వేరియంట్ బారినపడ్డారు. తద్వారా ఈమెకు కరోనా సోకింది అని ఐసీఎంఆర్ అధికారి తెలిపారు.

ఇటీవల బెల్జియంకు చెందిన 90 ఏళ్ల వృద్దురాలికి డబుల్ ఇన్ఫెక్షన్‌కు గురైంది. ఆమెకు ఒకేసారి ఆల్ఫా, బీటా వేరియంట్లు సోకినట్లు వైద్యులు గుర్తించారు. తర్వాత ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ప్రాణాలు కోల్పోయారు. ఆ వృద్ధురాలు అసలు టీకా వేయించుకోలేదని ఆమెను పరీక్షించిన వైద్యులు తెలియజేశారు.

Tags

Read MoreRead Less
Next Story