TS : తెలంగాణ అటవీశాఖలో 2,108 పోస్టులు ఖాళీ

TS : తెలంగాణ అటవీశాఖలో 2,108 పోస్టులు ఖాళీ

రాష్ట్ర అటవీశాఖలో 2,108 పోస్టులు ఖాళీగా ఉన్నాయని అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. మొత్తం 6,860 పోస్టులకు 4,752 మంది సిబ్బందే ఉన్నట్లు తెలిపారు. ఉన్నవారిలో కొందరు ఇతర శాఖలకు డిప్యుటేషన్‌పై వెళ్లాల్సిన పరిస్థితి ఉందని సీఎం రేవంత్‌కు వివరించారు. ఖాళీ పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు పంపించాలని, అటవీశాఖ నుంచి డిప్యుటేషన్‌పై ఇతర శాఖల్లో పనిచేస్తున్న వారి వివరాలు ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు.

అటవీశాఖలో టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టులు 37 మంజూరు కాగా 36 ఖాళీగా ఉన్నాయి. ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ పోస్టులు 3,652కు గాను 1419, నాలుగో తరగతి ఉద్యోగుల పోస్టులు 843కు 414 ఖాళీగా ఉన్నాయి. అసిస్టెంట్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ పోస్టులు 61కి 15, ఐఎఫ్‌ఎస్‌ పోస్టులు 81కి 26, ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ పోస్టులు 734కి 64, ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ పోస్టులు 274కి 21, అటవీ కళాశాలలో 66కు 52, ఇతర పోస్టులు 1112కి 61 ఖాళీగా ఉన్నాయి. మొత్తంగా 6,860 పోస్టులకు 4,752 మంది సిబ్బందే ఉన్నారని, 2,108 పోస్టులు ఖాళీగా ఉన్నాయని అధికారులు నివేదించారు.

Tags

Read MoreRead Less
Next Story