AI Teacher : కేరళ స్కూల్లో ఏఐ టీచర్

AI Teacher : కేరళ స్కూల్లో ఏఐ టీచర్

ఏఐ వినియోగంలో కేరళ ముందడుగేసింది. స్కూల్లో ఏఐ పంతులమ్మతో విద్యార్థులకు పాఠాలు చెప్పించి. ఈ తరహా ప్రయోగం దేశంలో ఇదే మొట్టమొదటిది కావడం విశేషం. వివరాలలోకి వెళితే తిరువనంతపురంలోని కేటీసీటీ పాఠశాలలో ఏఐ టీచర్ ను పరిచయం చేశారు. అటల్ టింకరింగ్ ల్యాబ్ ప్రాజెక్టు లో భాగంగా కొచ్చికి చెందిన స్టార్టప్ సంస్థ మేకర్ ల్యాబ్స్ ఎడ్యుటెక్ సహకారంతో దీన్ని ఆవిష్కరించారు.

ఈ ఏఐ టీచర్ కు ఐరిస్ అని నామకరణం చేశారు. మానవ రూపంలో, చీరకట్టుతో ఆకర్షిస్తున్న ఐరిస్ విద్యార్థులను ఆకట్టటుకుంది. నేరుగా విద్యార్థుల వద్దకు వెళ్లి వారి ప్రశ్నలకు సమాధానం చెబుతూ, సందేహాలను నివృత్తి చేస్తోంది. మరొక విశేషమే మిటంటే, ఈ ఐరిస్ మూడు భాషల్లో బోధన చేస్తుంది. అచ్చం స్త్రీ స్వరంతో మాట్లాడే ఈ ఐరిస్ టీచింగ్ పై విద్యార్థులు ఆసక్తి కనబరిచారు.

ఇందుకు సంబంధించిన వీడియోను మేకర్ ల్యాబ్స్ ఎడ్యుటెక్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ క్రియేషన్ భవిష్యత్ ఆవిష్కరణలపై విశ్వాసం కలిగిస్తుందని పేర్కొంది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఐరిస్ పరిచయం కేరళ విద్యారంగంలో గణనీయమైన మార్పును సూచిస్తోందని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story