DSC : డీఎస్సీకి వారు అర్హులే.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

DSC : డీఎస్సీకి  వారు అర్హులే..  తెలంగాణ  ప్రభుత్వం కీలక నిర్ణయం

2011 కంటే ముందు డిగ్రీ పాసైన వారందరినీ డీఎస్సీకి అర్హులుగా ప్రకటించాలని ప్రభుత్వం యోచిస్తోంది. టీచర్ పోస్టుల అర్హత విషయంలో నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (NCET) ఉత్తర్వులను అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. 2011, జూలై 29 కంటే ముందు డిగ్రీ పాసైన వారంతా మార్కులతో సంబంధం లేకుండా టీచర్ పోస్టులకు అర్హులని NCET గెజిట్ జారీ చేసింది.

అలాగే 2011 తర్వాత పాసైన ఓసీలకు 45%, మిగతా వారికి 40% మార్కులుంటే సరిపోతుందని పేర్కొంది. ప్రస్తుతం డీఎస్సీ నోటిఫికేషన్ లో డిగ్రీతో పాటు బీఈడీ పాసై ఉండాలి. డిగ్రీలో ఓసీలకు 50% మార్కులు, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 45% మార్కులుంటేనే డీఎస్సీ కి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.

దీనిపై కొందరు అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఎన్​సీటీఈ కొన్ని మార్పులు చేసింది. త్వరలోనే దీనిపై అధికారికంగా ఉత్తర్వులు జారీచేసే అవకాశం ఉన్నది. ఇప్పటికే డీఎస్సీ అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా, సుమారు 14 వేల దరఖాస్తులు వచ్చాయి.

Tags

Read MoreRead Less
Next Story