TS : ప్రైవేట్ కాలేజీలకు ఇంటర్ బోర్డు వార్నింగ్

TS : ప్రైవేట్ కాలేజీలకు ఇంటర్ బోర్డు వార్నింగ్

షెడ్యూల్ రాకముందే అడ్మిషన్‌లు తీసుకుంటే చర్యలు తప్పవని తెలంగాణ లోని ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు ఇంటర్ బోర్డు వార్నింగ్ ఇచ్చింది. పీఆర్వోలను పెట్టుకుని కొన్ని కాలేజీలు అడ్మిషన్లు చేయిస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని వెల్లడించింది. ఇంకా జూనియర్ కాలేజీలకు 2024-25 విద్యాసంవత్సరం అనుబంధ గుర్తింపు ఇవ్వలేదని తెలిపింది. నిబంధనలు ఉల్లంఘించే కళాశాలలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. గుర్తింపు పొందిన కాలేజీల వివరాలను tsbie.cgg.gov.in, acadtsbie.cgg.gov.in వెబ్ సైట్లలో పెడ్తామని, వాటిల్లో మాత్రమే చేరాలని సూచించారు.

ఇక అటు ఇంటర్మీడియట్‌ కాలేజీలకు వేసవి సెలవులను ఇంటర్‌ బోర్డు ప్రకటించింది. మార్చి 31వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు రాష్ట్రంలోని ఎయిడెడ్, ప్రైవేట్, ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించింది. దీంతో జూన్‌ 1వ తేదీన తిరిగి కాలేజీలు తెరుచుకోనున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలన్నీ దీనిని తూచాతప్పకుండా పాటించాలని అధికారులు సూచించారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరైనా కాలేజీలను నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇదిలా ఉంటే ఈ ఏడాది ఇంటర్‌ పరీక్షలు ఫిబ్రవరి 28వ తేదీన మొదలై మార్చి 19వ తేదీన ముగిసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది మొత్తం 9 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 4,78,527 మంది ఫస్ట్‌ ఇయర్‌. 4 లక్షలకుపైగా సెకండ్ ఇయర్ విద్యార్థులు ఉన్నారు. ఈసారి పరీక్షలకు మొత్తం 9,22,520 మంది విద్యార్థులు ఎగ్జామ్ ఫీజును చెల్లించారు.

Tags

Read MoreRead Less
Next Story