Layoffs : జాబ్స్ పోతున్నాయ్.. మరో దిగ్గజ కంపెనీలో 'లేఆఫ్స్' భయం

Layoffs : జాబ్స్ పోతున్నాయ్.. మరో దిగ్గజ కంపెనీలో లేఆఫ్స్ భయం

సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీని కరోనా తర్వాతి పరిణామాలు వెంటాడుతున్నాయి. ఇటీవల ఓ కంపెనీ పెద్ద ఎత్తున మ్యాన్ పవర్ ను వదులకుంది. దేశంలో ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ ఉద్యోగులు దినదినగండంగా బతుకుతున్నారు. ఈ కంపెనీ 2023-24 ఆర్థిక సంవత్సంలో మొత్తం 25,995 మంది ఉద్యోగులను తొలగించినట్లు లెక్కలు చెబుతున్నాయి. 2001 నుంచి ఇన్పోసిస్ లో ఉద్యోగుల రిక్రూట్ మెంట్, లేఆఫ్స్ ఉంటున్నా కూడా ఇంత పెద్ద మొత్తంలో తొలగించడం ఇదే మొదటిసారి. ఇన్ఫోసిస్ ఉద్యోగులను తీసేయడానికి నష్టాల బాట పట్టడమే కారణం అని తెలుస్తోంది.

ఈ కంపెనికి చెంది ఆట్రిషన్ రేటు గత ఏడాదిగా 12.9 నుంచి 12.6 శాతానికి తగ్గింది. వరుసగా 5 త్రైమాసిక ఫలితాల్లో ఓవరాల్ గా నష్టాలను చవి చూస్తోంది. అయితే 4వ త్రైమాసికం ఫలితాలను గత వారం కంపెనీ వెల్లడించింది. ఈ ఫలితాల్లో కంపెనీ లాభాల్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. 2021 మార్చి 31 వరకు 30 శాతం వృద్ధి సాధించి రూ.7969 కోట్ల లాభాలు ఆర్జించినట్లు ప్రకటించింది.

ఇన్ఫోసిస్ లో తొలగింపు జరుగుతున్నా కూడా ఉద్యోగాల భర్తీ కూడా భారీగానే ఉంటోంది. కంపెనీలు కాస్ట్ కటింగ్ కు మొగ్గు చూపుతున్నాయి. 2024 జనవరి నుంచి మార్చి వరకు కొత్తగా 5,423 మంది కొత్తవారిని చేర్చుకున్నారు. దీంతో ప్రస్తుతం కంపెనీలో 3,17, 240 మంది పనిచేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story