TS : తెలంగాణలో గ్రూప్-2, 3 పోస్టులు పెరిగే అవకాశం

TS : తెలంగాణలో గ్రూప్-2, 3 పోస్టులు పెరిగే అవకాశం

గ్రూప్-2, 3 పోస్టులు మరికొన్ని పెరిగే అవకాశం ఉంది. ఈక్రమంలోనే ఆయా విభాగాల వారీగా ఖాళీల వివరాలను ఇవ్వాలని అధి కారులకు స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు తాజాగా ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలో గ్రూప్స్ పరీక్షల తేదీలను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ) ఇప్పటికే ప్రకటించింది. అయితే గ్రూప్-2లో మొత్తం 783 ఖాళీలకు 2022 డిసెంబర్ 29న నోటిఫికేష నా న ను టీఎస్ పీఎస్సీ జారీ చేసింది.

అలాగే గ్రూప్-3 నోటిఫికేషన్ ను 2022 డిసెంబర్ 30వ తేదీన 1388 పోస్టులకుగానూ నోటిఫికేషన్ ను విడుదల చేయ గా, గ్రూప్-1 నోటిఫికేషన్ ను కూడా 503 పోస్టులతో అప్ప ట్లో వేశారు. అయితే గత ప్రభుత్వ హయాంలో వేసిన గ్రూప్-1 పాత నోటిఫికేషను రద్దు చేసి, వాటికి అద నంగా మరో 60 పోస్టులను కలిపి మొత్తం 563 పోస్టులకు ఈ ఏడాది ఫిబ్రవరి 19న కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త నోటి ఫికేషన్ ను విడుదల చేసింది.

ఈక్రమంలో గ్రూప్-2, 3 పోస్టుల సంఖ్యను పెంచాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. రాష్ట్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ పోస్టుల సంఖ్యను పెంచుతామని కాంగ్రెస్ నేతలు అసెంబ్లీ ఎన్నికల సమయంలో అభ్యర్థులకు హామీ ఇచ్చారు. అయితే గ్రూప్-1 మినహా గ్రూప్-2, 3 పోస్టుల పెంచకుండానే పాత నోటిఫికేషన్లకు అనుగుణంగా టీఎస్పీఎస్సీ ఈనెల 6వ తేదీన పరీక్ష తేదీలను ప్రకటించడంతో అభ్యర్థుల నుంచి వ్యతిరేకత వచ్చింది.

పోస్టుల సంఖ్యను పెంచాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే గురువారం సాయంత్రం 5 గంటల వరకు గ్రూప్-2, 3 ఖాళీల వివరాలను తెలు పాలని స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఈమేరకు ఆదేశాలు ఇచ్చిన నేప థ్యంలో పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్-2, అక్టోబర్ 21 నుంచి గ్రూప్-1 మె యిన్స్, నవంబర్ 17, 18న గ్రూప్-3 పరీక్ష లు జర గనున్నాయి. గ్రూప్-1 ప్రిలిమ్స్ జూన్ 9న నిర్వ హిం చనున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Tags

Read MoreRead Less
Next Story