Railway Jobs : రైల్వేలో జాబ్స్.. నిరుద్యోగులకు గుడ్ న్యూస్

Railway Jobs : రైల్వేలో జాబ్స్.. నిరుద్యోగులకు గుడ్ న్యూస్

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపింది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు. ఆర్​ఆర్​బీ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్, ఎస్ఐ రిక్రూట్మెంట్ 2024 దరఖాస్తు ప్రక్రియ సంబంధిత ఆర్​ఆర్​బీకి చెందిన అధికారిక వెబ్​సైట్​ లో ఏప్రిల్ 15న ప్రారంభమైంది.ఆర్పీఎఫ్ ఎస్ఐ, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి మే 14 వరకు గడువు ఉంది.

దరఖాస్తు ఫారం కరెక్షన్ విండో 2024 మే 15 నుంచి 24 వరకు అందుబాటులో ఉంటుంది. ఆర్​ఆర్​బీ ఆర్పీఎఫ్ ఎస్ఐ, కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ 2024కు సంబంధించి వయోపరిమితి వివరాలు ఇలా ఉన్నాయి. కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పోస్టులు:- 2024 జూలై 1 నాటికి 18-28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్ఐ పోస్టులు:- 2024 జూలై 1 నాటికి 20-28 ఏళ్ల మధ్య ఉండాలి.

కరోనా కారణంగా నిర్దేశిత పరిమితికి మించి.. వయోపరిమితిలో ఈసారి 3 సంవత్సరాల వన్ టైం ​ రిలాక్సేషన్ ను ఇచ్చారు. రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో మరింత సడలింపు వర్తిస్తుంది. విద్యార్హతలు వెబ్ సైట్ లో చూడొచ్చు. దరఖాస్తుదారులు తమ ఫారాలను ఆర్​ఆర్​బీల సంబంధిత వెబ్​సైట్లలో సమర్పించాల్సి ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story