TS : 5,348 పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

TS : 5,348 పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) మరో గుడ్ న్యూస్ చెప్పింది .వైద్యారోగ్య శాఖలో 5,348 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈమేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పబ్లిక్ హెల్త్, ఆయుష్, డ్రగ్ కంట్రోల్, ఐపీఎం, డీఎంఈ, వైద్య విధాన పరిషత్ విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రిలో ఉద్యోగాల భర్తీకి కూడా ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. వైద్యారోగ్య సర్వీసు నియామక బోర్డు ద్వారా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. త్వరలో పూర్తి నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో భారీ మొత్తంలో ఖాళీలను భర్తీకి అనుమతిస్తూ ఆర్థిక శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసిన క్రమంలో.. వాటిలో బోధనా సిబ్బందిని నియమించేందుకు వైద్యారోగ్య సిద్ధమైంది. మెడికల్ కాలేజీల్లోని ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సీనియర్ రెసిడెంట్లు ఇలా అన్ని కలిపి ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story