UPSC : ఫ్యామిలీకి తెలియకుండా పరీక్ష రాసి.. 4వ ర్యాంక్ తెచ్చుకున్నాడు

UPSC :  ఫ్యామిలీకి తెలియకుండా పరీక్ష రాసి.. 4వ ర్యాంక్ తెచ్చుకున్నాడు

నిన్న ప్రకటించిన యూపీఎస్సీ ఫలితాల్లో విజేతలుగా నిలిచిన వారిలో ఒక్కొక్కరిది ఒక్కో స్టోరీ. అయితే.. కేరళకు చెందిన UPSC 4వ ర్యాంకర్ సిద్ధార్థ్ రామ్‌కుమార్ మాత్రం చాలా స్పెషల్. ఎందుకంటే.. ఆయన పరీక్ష రాసిన విషయం తన కుటుంబ సభ్యులకు కూడా తెలియదట. టీవీలో చూశాకే తమకు తెలిసిందని తన పేరెంట్స్ చెప్పారు. గతంలోనే IPSకు ఎంపికైన సిద్ధార్థ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో శిక్షణ పొందుతున్నారు.

ప్రభుత్వ స్కూలు, కాలేజీలో ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన వ్యక్తి సివిల్ ర్యాంకర్‌గా నిలిచారు. సింగరాయకొండ(మ) ఊళ్లపాలేనికి చెందిన ఉదయ్‌కృష్ణారెడ్డి చిన్నప్పుడే పేరెంట్స్‌ను కోల్పోయారు. కూరగాయలు అమ్మి తనను చదివించిన నానమ్మ త్యాగం, కష్టాన్ని స్మరించుకుంటూ 780వ ర్యాంక్ సాధించారు. CI అవమానించడంతో 2019లో కానిస్టేబుల్ ఉద్యోగానికి రిజైన్ చేసి, సివిల్స్ వైపు మళ్లారు. 4వ ప్రయత్నంలో ఈ ర్యాంక్ సాధించారు.

మరోవైపు ఉద్యోగంలో జరిగిన అవమానం ఉదయ్కృష్ణారెడ్డిని సివిల్స్ ర్యాంక్ సాధించేలా ప్రేరేపించింది. చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయిన అతడు డిగ్రీ చదువుతుండగానే 2012లో కానిస్టేబుల్ ఉద్యోగం సాధించారు. ప్రకాశం జిల్లాలోని గుడ్లూరు, రామాయపట్నం స్టేషన్‌లలో విధులు నిర్వహించారు. ఆ సమయంలో ఓ సీఐ అవమానించడంతో 2019లో ఉద్యోగానికి రాజీనామా చేశారు. తర్వాత సివిల్స్‌‌కు సన్నద్ధమై తాజా ఫలితాల్లో 780వ ర్యాంకుతో మెరిశారు.

Tags

Read MoreRead Less
Next Story