Tamilnadu : ఆలయ పండుగలో కూలిన 60అడుగుల భారీ రథం

Tamilnadu : ఆలయ పండుగలో కూలిన 60అడుగుల భారీ రథం

తమిళనాడులోని (Tamilnadu) వెల్లూరులో (Vellore) మయన కొల్లై ఉత్సవం కోసం నిర్మించిన 60అడుగల పొడవైన రథం ఆసక్మికంగా కూప్పకూలింది. మార్చి 9న ఈ ఘటన చోటుచేసుకుంది. ఉత్సవంలో భాగంగా రథాన్ని అంగళపరమేశ్వరి అమ్మన్ విగ్రహాన్ని పాలారు నది ఒడ్డుకు తీసుకువెళ్లాలని భావించారు. అలా భక్తులు రథాన్ని నది ఒడ్డుకు తీసుకువెళ్లడానికి ప్రయత్నిస్తుండగా రథం ఒక్కసారి కుప్పకూలి గందరగోళం చెలరేగింది.

ఈ ఘటనలో రథం పైభాగంలో విమలరాజా వెణ్మణి అనే వ్యక్తి చిక్కుకుపోయాడు. అతను ప్రస్తుతం వేణ్మణి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. భక్తులు రథాన్ని తిప్పడానికి ప్రయత్నించగా అది బ్యాలెన్స్ కోల్పోయి, పైభాగం కూలిపోయింది. అంతలోనే విమల్ రాజ్ దాని కింద చిక్కిపోయాడు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story