Alert : ఆ రెండు దేశాలకు వెళ్లొద్దు.. భారత ప్రభుత్వం హెచ్చరిక

Alert : ఆ రెండు దేశాలకు వెళ్లొద్దు.. భారత ప్రభుత్వం హెచ్చరిక

దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నా ప్రజల ప్రాణాలు కాపాడేచర్యలు తీసుకుంటుంటారు. ఐతే.. యుద్ధం తీవ్ర రూపం దాల్చినప్పుడు ఏ దేశం ఏమీ చేయలేదు. అలాంటి పరిస్థితి రావడంతో.. భారత ప్రభుత్వం హై అలర్ట్ అయింది. హమాస్, ఇజ్రాయిల్ మధ్య యుద్ధాన్ని ప్రపంచమంతా చూస్తోంది. గత కొన్ని నెలల నుంచి ఈ రెండు దేశాల మధ్య తీవ్రస్థాయిలో యుద్ధం జరుగుతోంది. ఏకంగా హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయిల్ ను టార్గెట్ గా బాంబుల వర్షం కురిపిస్తున్నారు. తమ దేశ రక్షణ కోసం ఎంతకైనా తెగించేందుకు సిద్ధంగా ఉండే ఇజ్రాయిల్ మెరుపు దాడులు చేస్తోంది. ఇజ్రాయిల్ మెరుపు దాడుల్లో ఇక ఎంతోమంది సామాన్య పౌరులు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు.

ఇజ్రాయిల్ సహా ఇరాన్ లాంటి దేశాలలో ఉన్న భారతీయుల రక్షణ ఇక భారత విదేశాంగ శాఖకు పెద్ద సవాల్ గా మారింది అని చెప్పాలి. ఇటీవల సిరియాలోని ఇరాన్ కాన్సోలేట్ ఫై ఇజ్రాయిల్ వైమానిక దాడికి పాల్పడింది. దీంతో ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య తీవ్రస్థాయిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయ్. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ రెండు దేశాలకు కూడా వెళ్లాలి అనుకునే భారతీయులందరికీ భారత విదేశాంగ శాఖ కీలకమైన సూచనలు చేసింది.

తదుపరి సమాచారం ఇచ్చేవరకు ఇరాన్, ఇజ్రాయిల్ దేశాలకు భారతీయులు ఎవరు కూడా వెళ్ళవద్దు అంటూ హెచ్చరించింది. ఇప్పటికే అక్కడ ఉన్నవారు ఇండియన్ ఎంబసీతో టచ్ లో ఉండాలి. తమ పేర్లను అక్కడ రిజిస్టర్ చేసుకోవాలి అంటూ సూచించింది భారత విదేశాంగ శాఖ. ఇరాన్ కాన్సులేట్ పై ఇజ్రాయిల్ దాడి చేయడంతో.. ఇక ఇప్పుడు ఇరాన్ కూడా ఎదురుదాడికి దిగిన నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో.. భారత విదేశాంగ శాఖ అలర్టై తగిన సూచనలు జారీచేసింది.

Tags

Read MoreRead Less
Next Story