Banks Holidays : ఏప్రిల్ నెలలో బ్యాంకులు తెరిచేది 16 రోజులే..

Banks Holidays : ఏప్రిల్ నెలలో బ్యాంకులు తెరిచేది 16 రోజులే..

కొత్త ఆర్థిక సంవత్సరం తొలి నెలలో బ్యాంకుల పని దినాలు సగం రోజులకే పరిమితం అవుతున్నాయి. ఆర్బీఐ నోటిఫికేషన్ ప్రకారం వివిధ రాష్ట్రాలతో కలిపి బ్యాంకులకు 14 రోజులు సెలవులు వస్తున్నాయి. దాంతో పని దినాల సంఖ్య 16 రోజులకు తగ్గింది. ప్రతినిత్యం బ్యాంకు ద్వారా నేరుగా లావాదేవీలు నిర్వహించే వ్యాపారవర్గాలు ఈ విష యాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. ఏప్రిల్ 1న (నేడు) వార్షిక బ్యాంకు ఖాతాల క్లోజింగ్ సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసివుంటాయి.

అయితే, చండీగఢ్, సిక్కిం, మిజోరం, పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, మేఘాలయ రాష్ట్రాలలో మాత్రం బ్యాంకులు పనిచేస్తాయి. అలాగే ఏప్రిల్ 5న బాబూ జగ్జీవన్ రామ్ జయంతి, జుమాత్ ఉల్ విదా తెలంగాణ, జమ్ములో బ్యాంకులకు సెలవు. 9వ తేదీన తెలు గు సంవత్సరాది ఉగాది పర్వదినం. తెలుగు రాష్ట్రాల తోపాటు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, గోవా, జమ్ము- కాశ్మీర్ రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు. ఆ మర్నాడు బైశాఖీ, బిజూ ఫెస్టివల్ నేపథ్యంలో త్రిపుర, అసోం, జమ్ము- కాశ్మీర్ లో బ్యాంకులు పనిచేయవు.

15న బొహగ్ బిగు, హిమాచల్ ప్రదేశ్ దినోత్సవం సందర్భంగా, ఏప్రిల్ 16న శ్రీరామనవమి సందర్భంగా వివిధ రాష్ట్రాలలో బ్యాంకులకు సెలవు. 20న గరియ పూజ సందర్భంగా త్రిపురలో బ్యాంకులకు హాలిడే. అదేవిధంగా 13న రెండవ శనివారం, 27న నాలుగో శనివారం సెలవులతోపాటు 7, 14, 21, 28 ఆదివారాల్లో బ్యాంకులకు జాతీయ సెలవు దినాలు.

Tags

Read MoreRead Less
Next Story