ED : పదేళ్లలో ఈడీ దూకుడు... రూ.1,21కోట్ల ఆస్తులు జప్తు

ED : పదేళ్లలో ఈడీ దూకుడు...   రూ.1,21కోట్ల ఆస్తులు జప్తు

ఈడీ గత పదేళ్లలో దూకుడు పెంచింది. మన్మోహన్ పాలనలో 1,797 కేసులు నమోదు కాగా.. మోదీ ప్రధాని అయ్యాక ఏకంగా 5,155 కేసులు నమోదయ్యాయి. అప్పుడు 29మందిని అరెస్టు చేస్తే ఈ పదేళ్లలో 755మందిని అరెస్టు చేసింది. మోదీ పాలనలో రూ.1,21,618కోట్ల ఆస్తులను జప్తు చేసింది. యూపీఏ హయాంతో పోల్చితే ఎన్డీయే పాలనలో 86రెట్లు ఈడీ సోదాలు నిర్వహించింది.

2005లోనే PMLA అమల్లోకి వచ్చినా.. శిక్షలు మాత్రం 2014 నుంచే మొదలయ్యాయి. కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ హయాంతో పోలిస్తే బీజేపీకి చెందిన ఎన్డీయే హయాంలో 86 రెట్లు ఎక్కువగా ఈడీ రైడ్స్ చేసింది. 24 రెట్లు అధికంగా ఈడీ అరెస్టులు చేసింది. యూపీఏ హయాంలో ఈడీ 84 సోదాలు చేసింది. గత పదేళ్లలో 7,264 సోదాలు చేసింది.

యూపీఏ హయాంలో స్థిర, చరాస్తుల జప్తునకు 311 ఉత్తర్వులను ఈడీ జారీ చేసింది. గత పదేళ్లలో దీనికి సంబంధించిన 1971 ఉత్తర్వులను జారీ చేసింది. యూపీఏ హయాంలో ఈడీ 102 ఛార్జిషీట్లు దాఖలు చేసింది. గత పదేళ్లలో 1281 ఛార్జిషీట్లు నమోదయ్యాయి. 2014-24 మధ్య కాలంలో భారత్‌ వదిలి వెళ్లిన నిందితులను పట్టుకొనేందుకు ఈడీ 24 ఇంటర్‌ పోల్‌ రెడ్‌ నోటీసులు విడుదల చేసింది. 43 మంది నిందితులను అప్పగించాలని కోరుతూ వివిధ దేశాలకు లేఖలు రాసింది.

Tags

Read MoreRead Less
Next Story