Flight Ticket : అక్కడ రూ.150కే ఫ్లైట్ టికెట్.. ఎందుకంటే?

Flight Ticket : అక్కడ రూ.150కే ఫ్లైట్ టికెట్.. ఎందుకంటే?

విమానం టికెట్ అంటే కనీసం రూ.3వేలైనా ఉంటుంది. కానీ మన దేశంలో కొన్ని రూట్లలో విమానం టికెట్ ధర రూ.150నే అని తెలుసా? రీజినల్ ఎయిర్ కనెక్టివిటీ స్కీమ్ కింద కేంద్రం పలు చోట్ల అమలు చేస్తున్న ధరలివి. ఈ స్కీమ్‌లో భాగంగా ధర రూ.1000లోపే ఉంటుంది. కనిష్ఠంగా అస్సాంలోని లిలాబరీ-తేజ్‌పూర్ మధ్య ఫ్లైట్ టికెట్ రూ.150గా ఉంది. డిమాండ్ తక్కువ ఉన్న రూట్లలో విమానయాన రంగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం ఈ స్కీమ్ తెచ్చింది.

ట్రావెల్ పోర్టల్ ‘ఇక్సిగో’ ప్రకారం లీలాబరి- తేజ్‌పూర్ లాంటి చౌకైన విమాన రూట్స్ మనదేశంలో దాదాపు 22 ఉన్నాయి. ఈ రూట్లలో టికెట్ కనీస ధర రూ.1000లోపే ఉందట. 2016 అక్టోబర్ 21న కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ఉడాన్ స్కీం వల్ల ఈ రూట్లలో టికెట్ల రేట్లు తగ్గిపోయాయి. ఉడాన్ స్కీం, రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ (ఆర్సీఎస్)లలో చేరే విమానయాన సంస్థలు 50 నిమిషాలలోపు జర్నీ పూర్తి చేయగలిగే రూట్లలో టికెట్ల ధరలను అతిగా వసూలు చేయవు.

అందుకే లీలాబరి- తేజ్‌పూర్ రూటులో విమానం టికెట్ రేటు రూ.150కే దొరుకుతోంది. ఆర్సీఎస్ స్కీంలో భాగంగా ఉన్న విమానయాన సంస్థల విమానాలకు వివిధ ప్రోత్సాహకాలు అందుతాయి. వాటికి ల్యాండింగ్ ఛార్జీలు, పార్కింగ్ ఛార్జీలు ఉండవు. ఇవన్నీ ప్రయోజనాలు లభిస్తాయి కాబట్టే కొన్ని ప్రాంతీయ రూట్లలో విమాన టికెట్ల రేట్లు తక్కువగా ఉంటాయి.

Tags

Read MoreRead Less
Next Story