Shocking Incident : స్కూలు బాత్ రూమ్ లో దారుణం.. ఐదేళ్ల బాలుడిపై లేడీ లైంగిక దాడి

Shocking Incident : స్కూలు బాత్ రూమ్ లో దారుణం.. ఐదేళ్ల బాలుడిపై లేడీ లైంగిక దాడి

వింటేనే అమానుషం అనిపించే నేరాలు కొన్ని అప్పుడప్పుడూ జరుగుతుంటాయి. తమిళనాడులోని (Tamilnadu) తంజావూరులో దారుణం వెలుగు చూసింది. ఐదేళ్ల బాలుడిపై 50 ఏళ్ల మహిళ లైంగిక వేధింపులకు పాల్పడింది. సదరు మహిళను మార్చి 19, మంగళవారం సాయంత్రం మహిళను పోలీసులు అరెస్టు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హయ్యర్‌ సెకండరీ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ కోఆర్డినేటర్‌గా ఓ మహిళ పనిచేస్తోంది. అదే స్కూల్లో నర్సరీ చదువుతున్న ఓ బాలుడున్నాడు. పాఠశాలలోని టాయిలెట్లోకి ఆ ఐదేళ్ల బాలుడు వెళ్లడం గమనించింది. అతడిని లైంగికంగా వేధించడంతో పాటు ఆ మహిళ దుర్భాషలాడింది.

ఆ చిన్నారిని బాత్ రూమ్ లోకి తీసుకెళ్లి లైంగిక దాడి చేసినట్టు పోలీసులు తెలిపారు. విషయాన్ని ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలుంటాయని బాలుడిని బెదిరించింది. అయితే అదే స్కూల్‌లో చదువుతున్న అన్నయ్యతో ఆ బాలుడు తనకు ఎదురైన బాధను వివరించాడు. బాధితుడి అన్నయ్య ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేయగా, వారు వెంటనే కుంభకోణం మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మహిళను అరెస్టు చేసి, పోక్సో చట్టంతో పాటు ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద కేసు పెట్టారు. జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story