Tri Series : పాక్‌లో హిస్టారికల్ ట్రయాంగిల్ సిరీస్..

Tri Series : పాక్‌లో హిస్టారికల్ ట్రయాంగిల్ సిరీస్..

క్రికెట్ లో మరో ఇంట్రస్టింగ్ చాప్టర్ కు అంతా సిద్ధమైంది. 2025లో ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ టోర్నీకోసం భారత జట్టు పాకిస్థాన్‌లో పర్యటిస్తుందా లేదా అనేదానిపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే ఈలోగా పాకిస్థాన్‌లో చారిత్రాత్మక ముక్కోణపు సిరీస్ నిర్వహించనున్నారు. దీనికంటే ముందే ఏప్రిల్ లో న్యూజీలాండ్ తో 3 టీట్వంటీ మ్యాచ్ ల సిరీస్ ను ఆడనుంది పాక్.

ఈ హిస్టారికల్ ట్రై సిరీస్‌లో మూడు జట్లు పాల్గొంటాయని తెలుస్తోంది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత అంటే దాదాపు 21 ఏళ్ల తర్వాత పాకిస్థాన్ గడ్డపై ఉపఖండం పరిధిలోని దేశాల ట్రై సిరీస్ జరగబోతోంది. అంతకుముందు 2004లో ముక్కోణపు సిరీస్‌కి పాకిస్థాన్ ఆతిథ్యం ఇచ్చింది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ సోషల్ మీడియాలో ఈ పోస్ట్ చేసింది. ఎన్నాళ్లకెన్నాళ్లకు.. ఐనా ఎవరొస్తారు అంటూ ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.

ట్విస్ట్ ఏంటంటే ట్రైసిరీస్ అని ప్రకటించిన పాక్ బోర్డు అది ఏ పార్మాట్ అనేది కన్ ఫామ్ చేయలేదు. పాకిస్థాన్ వేదికగా జరిగే ఈ ముక్కోణపు సిరీస్‌లో పాకిస్థాన్‌తో సహా మూడు జట్లు ఆడనున్నాయి. ఆతిథ్య పాకిస్థాన్‌తో పాటు దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌లు పాల్గొంటాయి. పాకిస్థాన్‌లో పర్యటించాల్సిందిగా ఇరుదేశాల ప్రతినిధులను కూడా ఆహ్వానించారు. పాకిస్థాన్ చివరిసారిగా 2004లో శ్రీలంక, జింబాబ్వేతో సొంత గడ్డపై ట్రై-సిరీస్ ఆడింది.

Tags

Read MoreRead Less
Next Story