Cricket News : విరాట్ కోహ్లీ, స్మృతి మంధాన.. ఇద్దరిలో మూడు ముఖ్యమైన పోలికలు

Cricket News : విరాట్ కోహ్లీ, స్మృతి మంధాన.. ఇద్దరిలో మూడు ముఖ్యమైన పోలికలు
విరాట్ కోహ్లీ మరియు స్మృతి మంధాన ఇద్దరూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున లీగ్ క్రికెట్ ఆడుతున్నారు.

విరాట్ కోహ్లీ మరియు స్మృతి మంధాన ఇద్దరూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున లీగ్ క్రికెట్ ఆడుతున్నారు. అయితే, ఇద్దరు ఆటగాళ్ల మధ్య మూడు ప్రత్యేక సంబంధాలు ఉన్నాయి. వీటిని చూసిన తర్వాత మీరు కూడా ఆశ్చర్యపోతారు. అవేంటో చూద్దాం..

విరాట్ కోహ్లీ మరియు స్మృతి మంధాన ఇద్దరూ భారత జట్టుకు గర్వకారణం. పురుషుల క్రికెట్‌లో విరాట్ కోహ్లీ రారాజు అయితే, మహిళల క్రికెట్‌లో స్మృతి మంధాన రాణి. పెద్ద పెద్ద బౌలర్లు కూడా ఇద్దరు ఆటగాళ్ల ముందు బౌలింగ్ చేయడానికి వెనుకాడతారు. ఈ ఇద్దరు ఆటగాళ్ల మధ్య కొన్ని సంబంధాలు ఉన్నాయి. వీటిని చూసిన తర్వాత నిజమే కదా అని అనిపించక మానదు. నిజానికి ఈ కనెక్షన్ ఇండియన్ క్రికెట్ లీగ్‌కి సంబంధించినది.

ఒకవైపు ఐపీఎల్‌లో విరాట్ కోహ్లి హల్‌చల్ చేస్తుంటే , మహిళల ప్రీమియర్ లీగ్‌లో స్మృతి మంధాన దూసుకెళ్తుండగా, ఇద్దరు ఆటగాళ్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడటం విశేషం. డబ్ల్యూపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మంధాన కెప్టెన్‌గా వ్యవహరిస్తోంది. ఐపీఎల్‌లో బెంగళూరు కెప్టెన్సీని కూడా విరాట్ కోహ్లి స్వీకరించాడు.

విరాట్ కోహ్లీ, మంధాన జెర్సీ నంబర్ 18

విరాట్ కోహ్లీ, స్మృతి మంధాన ఇద్దరూ జెర్సీ నంబర్ 18 ధరించి ఆడతారు. ఇద్దరు ఆటగాళ్లు భారత జట్టుతో పాటు వారి ఫ్రాంచైజీ జట్టుకు చాలా ముఖ్యమైన పాత్రలు పోషిస్తారు. ఐపీఎల్‌లో విరాట్ కోహ్లి కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతుండగా, మంధాన కూడా డబ్ల్యూపీఎల్‌లో బెంగళూరు తరఫున ఆడడం బహుశా యాదృచ్చికం కావచ్చు. ఇద్దరు ఆటగాళ్లు బెంగళూరుకు ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా ఆడుతున్నారు.

రెండో సీజన్‌లో బెంగళూరు తరఫున హాఫ్ సెంచరీ చేశాడు

మొదట, విరాట్ కోహ్లీ గురించి మాట్లాడుకుంటే.. 2008లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అతనిని తమ జట్టులో చేర్చుకుంది. కానీ అతను తన మొదటి సీజన్‌లో ఒక్క అర్ధ సెంచరీ కూడా చేయలేకపోయాడు. ఐపీఎల్ రెండో సీజన్‌లో బెంగళూరుతో జరిగిన మూడో మ్యాచ్‌లో డెక్కన్ ఛార్జర్స్‌పై విరాట్ కోహ్లీ 32 బంతుల్లో 50 పరుగులు చేశాడు.

మహిళల ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ మూడో మ్యాచ్‌లో స్మృతి మంధాన డబ్ల్యూపీఎల్‌లో తొలి హాఫ్ సెంచరీ సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌పై మంధాన 74 పరుగుల ఇన్నింగ్స్ ఆడింది. తొలి సీజన్‌లో మంధాన ఒక్క అర్ధ సెంచరీ కూడా చేయలేకపోయింది.

ఇద్దరూ ఓడిపోయారు

విరాట్ కోహ్లి, స్మృతి మంధాన మధ్య మూడవ కనెక్షన్ మిమ్మల్ని మరింత ఆశ్చర్యపరుస్తుంది. నిజానికి ఇద్దరు ఆటగాళ్లు హాఫ్ సెంచరీలు చేసినప్పటికీ వారి జట్టు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. విరాట్, స్మృతి ఇద్దరూ కూడా భారత జట్టుకు కెప్టెన్లుగా ఉన్నారు. 2019లో ఇంగ్లండ్‌తో జరిగిన టీ20లో తొలిసారిగా మంధాన భారత జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టింది. విరాట్ కోహ్లీ కూడా భారత జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు.

Tags

Read MoreRead Less
Next Story