TS : చేవెళ్ల ఎంపీ బరిలో మా ఊరి పొలిమేర నటి

TS : చేవెళ్ల ఎంపీ బరిలో మా ఊరి పొలిమేర నటి

పొలిమేర, పొలిమేర-2 సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న నటి దాసరి సాహితి ఎన్నికల బరిలో నిలిచారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఎంపీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ శశాంకకు నామినేషన్‌ సమర్పించారు. తన ఆస్తులు సుమారు ఐదు లక్షలుగా చూపించారు. తన వయసు 29 ఏళ్లు అని, తనకు ఇంకా పెళ్లి కాలేదని అఫిడివిట్‌లో పేర్కొన్నారు. తన వార్షిక ఆదాయం గత ఆర్థిక సంవత్సరానికి రూ.4,98,810గా ఉన్నట్లు వెల్లడించారు. నితిన్ ‘ఎక్స్ట్రార్డినరీ మ్యాన్’, సింగర్ సునీత కుమారుడు ఆకాశ్ నటించిన ‘సర్కారు నౌకరీ’ సినిమాల్లోనూ సాహితి నటించారు.

ఆంధ్రప్రదేశ్​లో పుట్టి హైదరాబాద్​లో స్థిరపడిన నటి సాహితీ మోడలింగ్​, సినీ రంగంలో రాణిస్తున్నారు. రాజేంద్రనగర్​ నియోజకవర్గంలో నటి సాహితీ ఓటరుగా ఉన్నారు. చేవెళ్ల పార్లమెంటు స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకుని నామినేషన్​ దాఖలు చేశారు.

ఇక చేవెళ్ల పార్లమెంట్ స్థానానికి ప్రధాన పార్టీలు అభ్యర్ధులను ప్రకటించాయి. బీజేపీ తరపున కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, కాంగ్రెస్‌ నుంచి రంజిత్‌రెడ్డి బీజేపీ నుంచి కాసాని జ్ఞానేశ్వర్‌ బరిలో నిలిచారు. మరి వీరితో పోటీలో నిలిచిన దాసరి సాహితి ఎన్ని ఓట్లు సాధిస్తుందో చూడాలి.

ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ వేదికగా రాజకీయాల గురించి ప్రస్తావించిన దాసరి సాహితి.. తాను పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పారు. అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో తాను రీల్స్‌కు మాత్రం రాజకీయాలను అంటగట్టొద్దని సాహితి కోరారు.

Tags

Read MoreRead Less
Next Story