TS : ఎమ్మెల్యే లాస్య నందిత కేసులో లారీ డ్రైవర్ అరెస్ట్

TS : ఎమ్మెల్యే  లాస్య నందిత కేసులో లారీ  డ్రైవర్ అరెస్ట్

బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యే లాస్య నందిత (Lasya Nanditha) రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. లేటెస్ట్ గా లారీ డ్రైవర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రమాదం జరిగిన దగ్గరి నుంచి ముత్తంగి ఎగ్జిట్ వద్ద గల సీసీ కెమెరాల ఆధారంగా టిప్పర్ వెనక భాగంలో డ్యామేజీ అవడంతో లారీని పటాన్‌ చెరు పోలీసులు గుర్తించారు. ఈ టిప్పర్ రాక్ స్యాండ్ కంపెనీకి చెందినదిగా గుర్తించారు. టిప్పర్ నడిపిన డ్రైవర్ ను కర్ణాటకలో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

ఫిబ్రవరి 23న తెల్లవారు జామున లాస్య నందిత కారు పటాన్ చెరు ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదానికి గురై మరణిచారు. ఆమె కారు అదుపు తప్పి లారీ ఢీకొట్టి రెయిలింగ్ ను ఢీ కొట్టడంతో తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే చనిపోగా.. కారు నడిపిన పీఎ ఆకాశ్ కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుం ఆకాశ్ ఆస్పత్రిలో చికిత్స పొంతున్నాడు.

ఎమ్మెల్యే లాస్య నందిత సోదరి నివేదిత ఫిర్యాదుతో పటాన్ చెరు పోలీసులు పీఏ ఆకాష్ పై కేసు నమోదు చేశారు. 304 ఏ ఐపీసీ సెక్షన్ కింద ఆకాష్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. ఫిబ్రవరి 23న ఉదయం 5.15 గంటలకు ఆకాష్ ఫోన్ చేశాడని.. ఇద్దరికీ దెబ్బలు తగిలాయని లొకేషన్ షేర్ చేశాడని నివేదిత తెలిపింది. తాము వెళ్లి చూసేసరికి కారు నుజ్జు నుజ్జు అయిందని పేర్కొంది. నిర్లక్ష్యంగా కారు నడిపినందుకే లాస్య చనిపోయిందని నివేదిత ఫిర్యాదు చేయడంతో కేసును విచారిస్తున్నారు పోలీసులు.

Tags

Read MoreRead Less
Next Story