Rains : తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు అప్పుడే..!

Rains : తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు అప్పుడే..!

సూర్యుడి ప్రతాపంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ భగ్గుమంటున్నాయి. మే 7 వరకు అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉంటుందని భారత వాతావరణశాఖ హెచ్చరించింది. ఈశాన్య భారతంలో మరో రెండు రోజుల పాటు అంటే మే 5, 6 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

రాయలసీమ, తెలంగాణ, పశ్చిమ బెంగాల్​లోని గంగా నదీ తీర ప్రాంతం, బీహార్, ఝార్ఖండ్, ఒడిశా, మధ్య మహారాష్ట్ర, మరాఠ్వాడా, కోస్తాంధ్ర, యానాం, తమిళనాడు, పుదుచ్చేరి & కరైకల్, ఇంటీరియర్ కర్ణాటకలో మే 4 నుంచి 7 వరరకు వడగాల్పులు వీస్తాయి.

ఐతే.. కొన్ని ప్రాంతాల్లో మే 5, 6 తేదీల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే చాన్సుంది ఐఎండీ తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్​లో మే 5న భారీ నుంచి అతి భారీ వర్షాలు, మే 5, 6 తేదీల్లో నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రానున్న 4 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, కేరళ, మాహేల్లోని కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మే 7న కోస్తాంధ్ర, దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక, తమిళనాడు, కేరళల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో ఇంకొద్దిరోజులు ఎండకు ఓపికపడితే వాతావరణం చల్లబడొచ్చు.

Tags

Read MoreRead Less
Next Story