TS : కూల్.. తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలు

TS : కూల్..  తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలు

తెలంగాణలో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 3 రోజుల పాటు మోస్తరు వానలు కొనసాగుతాయని IMD వెల్లడించింది. వరంగల్, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్‌గిరి, వికారాబాద్, మెదక్, వనపర్తి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30-40KM వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని పేర్కొంది.

ఆదివారం వరకు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు అధికారులు. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్సుందన్నారు. ఆదిలాబాద్, కొమురం భీం, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లోనూ వానలు పడే అవకాశముందని తెలిపింది వాతావరణ శాఖ. గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశముందని ప్రకటించింది.

తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి, రామారెడ్డి మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది. పలు చోట్ల బలమైన ఈదురుగాలులు వీయడంతో విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. అటు నిజామాబాద్ జిల్లాలోని ఇందల్వాయి, ధర్పల్లి, సిరికొండ మండలాల్లో వడగండ్ల వాన పడుతోంది.

Tags

Read MoreRead Less
Next Story