ఆంధ్రప్రదేశ్

వైసీపీ 22 మంది ఎంపీలతో మరోసారి..

వైసీపీ 22 మంది ఎంపీలతో మరోసారి..
X

ప్రత్యేకహోదా.. అటు కేంద్రంలో, ఇటు APలో కొత్త ప్రభుత్వాలు కొలువుదీరినా హోదా అంశం మాత్రం ఇంకా రాజకీయంగా దుమారం రేపుతూనే ఉంది. నినాదం ప్రతిధ్వనిస్తూనే ఉంది. ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రానికి మేలు జరుగుతుందని.. పార్టీలు, ప్రజాసంఘాలంటున్నాయి. జాతీయపార్టీలు రెండూ కూడా రాష్ట్రానికి హోదా విషయంలో తీరని అన్యాయం చేశాయి. నాడు ఏపీ విభజన సందర్భంలో అప్పటి బీజేపీ నేత M.వెంకయ్యనాయుడు ప్రత్యేక హోదా ఇవ్వాలని అడిగితే ప్రధాని హోదాలో .. మన్మోహన్‌సింగ్‌ ఒప్పుకున్నారు. ఐదేళ్లు కాదు.. పదేళ్లు ఇచ్చి.. రాష్ట్రాన్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాటమార్చారు. ఆర్ధిక సంఘం, నీతీ ఆయోగ్ అంటూ రకరకాల కారణాలతో పక్కన పెట్టారు. ఏపీకి ఇవ్వడం వీలుకాదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా రాదని నిర్ణయానికి వచ్చిన తర్వాత టీడీపీ అధినేత, అప్పటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్న మాట వాస్తవం. అప్పటికే వైసీపీ ప్రత్యేకహోదా కోసం ఉద్యమిస్తోంది. కేంద్రం వద్ద హోదాను తాకట్టు పెట్టారని.. ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నారని అంతా అన్నారు.

జగన్‌ సహా... ఆంధ్రా మేధావుల సంఘం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్‌, నటుడు శివాజీ, వామపక్షాల నేతలు విమర్శించిన మాట వాస్తవం. ప్రత్యేక హోదా కోసమే.. జగన్‌ YCP ఎంపీలతో రాజీనామా చేయించార్నది నిజం. కానీ రాజీనామాలు జగన్ కు రాజకీయంగా మేలు చేశాయి కానీ.. హోదా విషయంలో ఉపయోగడపలేదు. తర్వాత ప్యాకేజీ విషయంలో అన్యాయం జరిగిందని చంద్రబాబు కూడా ఉద్యమబాట పట్టారు. ఇద్దరు మంత్రులను ఉపసంహరించుకున్నారు. ఎన్టీయే ప్రభుత్వం నుంచి బయటకొచ్చారు. NDA కి మద్ధతు ఉపసంహరించుకోవాలని జగన్‌ డిమాండ్ చేయడం.. టీడీపీ బయటకు రావడం అంతే నిజం. జగన్‌ ట్రాప్‌లో చంద్రబాబు పడుతున్నారని..నాడు ప్రధాని మోదీ... పార్లమెంట్‌లో పదేపదే చెప్పారు. కానీ చంద్రబాబు ఉద్యమం మరింత తీవ్రం చేశారు. BjP ఎన్నికలకు ముందే ప్రత్యేక హోదా ముగిసిన అంశమని... తేల్చేసింది. అయితే అన్ని పార్టీలు దీన్ని రాజకీయంగా వాడుకున్నాయి.

తనకు మెజార్టీ సీట్లు ఇస్తే హోదా తెస్తానని జగన్‌ చెప్పారు. BJP ప్రభుత్వం మారితే హోదా వస్తుందని చంద్రబాబు చెప్పారు. ప్రజలు జగన్ కు ఓ ఛాన్స్ ఇచ్చారు. ఆయనకు భారీ మెజార్టీతో అదికారం కటకటబెట్టారు. 22 మంది ఎంపీలను ఇచ్చారు. బీజేపీ అడ్రస్ గల్లంతు అయింది. చంద్రబాబు మాట మార్చారన్న అపప్రదతో ఓటమిపాలయ్యారు. ఇప్పుడు కూడా ఏపీ బీజేపీ చీఫ్‌ కన్నా లక్ష్మీ నారాయణ ప్రత్యేక హోదా రాదని తేల్చేశారు. మరి వైసీపీ 22 మంది ఎంపీలతో మరోసారి హోదా కోసం ప్రయత్నిస్తుందా? జగన్ ఏం చెయబోతున్నారు? మోదీతో కలిసి కొత్త ప్రతిపాదనలు తీసుకొస్తారా? ప్రజాసంఘాలు ఎలా స్పందిస్తాయి.? అనేది చూడాలి

Next Story

RELATED STORIES