ఇసుక సంక్షోభం మానవ తప్పిదమే: చంద్రబాబు

ఇసుక సంక్షోభం మానవ తప్పిదమే: చంద్రబాబు
X

babu

రాష్ట్రంలో ఇసుక సంక్షోభం మానవ తప్పిదమేనని మాజీ సీఎం చంద్రబాబు అన్నారు. పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ సందర్భంగా.. వైసీపీ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వైసీపీ నేతల స్వార్ధానికి... రోజువారి కూలీలు బలవుతున్నారని, లక్షలాది కార్మికుల జీవనోపాధిని దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశారు. సొంతూళ్లోని వాగులో ఇసుక తెచ్చుకోడానికి కూడా అనేక అడ్డంకులు సృష్టించారని మండిపడ్డారు. 10 రెట్లు ఎక్కువ ధరలకు ఇసుక విక్రయాలు చేస్తున్నా.. పట్టించుకునే వారు లేకుండా పోయారన్నారు చంద్రబాబు. ఆన్‌లైన్‌లో ఇసుక అమ్మకాలు జగన్ మాయగా మారాయని, అరగంటలోనే నో స్టాక్ బోర్డులు పెడుతున్నారని అన్నారు. ఏపీ నుంచి ఇసుక చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌కు అక్రమంగా రవాణా చేస్తున్న వారిపై చర్యలేవని ప్రశ్నించారు.

రాష్ట్రంలో ఆర్ధిక కార్యకలాపాలన్నీ దెబ్బతిన్నాయని, మొత్తం ఆర్ధిక వ్యవస్థ కుదేలయ్యే దుస్థితి తెచ్చారని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. రాజధానిపై ఇంకో కమిటి వేసి, దానికి సూచనలు ఇవ్వాలనడం హాస్యాస్పదమన్నారు. గోదావరి-కృష్ణా అనుసంధానాన్ని రివర్స్ చేస్తున్నారని కూడా మండిపడ్డారు. టీడీపీ నిర్మించిన భవనాలకు వైసీపీ రంగులు వేసుకోవడం మినహా ప్రభుత్వం ఇంత వరకూ ఏం చేసిందని నిలదీశారు.

Tags

Next Story