ఐదు నెలల్లో రాష్ట్రాన్ని ముంచేశారు: లోకేష్

ఐదు నెలల్లో రాష్ట్రాన్ని ముంచేశారు: లోకేష్
X

lo

ఆరు నెలల్లో మంచి సీఎం అనిపించుకుంటానన్న జగన్.. 5 నెలల్లో రాష్ట్రాన్నే ముంచేశారని మండిపడ్డారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. భవన నిర్మాణ కార్మికులకు తిండి లేకుండా చేసి వైసీపీ నేతలు ఇసుక తింటున్నారని ఆరోపించారు. ఇసుక కోసం ఏర్పాటు చేసిన వెబ్ సైట్ ఒక మాయ అని, అందులో సామాన్యులకు ఎప్పుడూ నో స్టాక్ అనే వస్తుందంటూ ఫైర్ అయ్యారు. వరదల వల్ల ఇసుక కొరత ఏర్పడింది అని మంత్రులు చెబుతున్నారని.. మరి రాష్ట్రంలో దొరకని ఇసుక బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ ఎలా వెళ్తోందని నిలదీశారు. గుంటూరు కలెక్టరేట్ ఎదుట ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టిన లోకేష్ భవన నిర్మాణ కార్మికులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు.

Tags

Next Story