సీబీఐ తీర్పును స్వాగతిస్తున్నాం: టీడీపీ

సీబీఐ తీర్పును స్వాగతిస్తున్నాం: టీడీపీ
X

babu

శుక్రవారం కోర్టుకు హాజరుకావడానికి వ్యక్తిగత మినహాయింపు ఇవ్వాలని జగన్ తరుపు న్యాయవాదులు వేసిన ఫిటిషన్ ను సీబీఐ న్యాయస్థానం డిస్మిస్ చేసింది. దీనిపై టీడీపీ నేతలు స్పందించారు. చట్టం ముందు అందరూ సమానమేనని.. జగన్‌ కేసులో సిబిఐ కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని టీడీపీ సీనియర్‌ నేత బోండా ఉమామహేశ్వరరావు అభిప్రాయపడ్డారు. మనదేశంలో చదువులకు రిజర్వేషన్లు ఉన్నాయి కానీ... బెయిలుకు కాదన్నారు. కోర్టు ఖర్చులకు ప్రజాధనం కాకుండా.. సొంత డబ్బులు పెట్టుకోవాల్సి ఉంటుందన్నారు బోండా.

మరోవైపు సొంత కేసు విచారణ ఎదుర్కొనేందుకు ప్రజల సొమ్మును ఖర్చు చేయడం సరికాదని మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, చినరాజప్ప అన్నారు. కోర్టు హాజరు నుంచి మినహాయింపు కోరడం సరికాదంటూ సీఎం జగన్ తీరును తప్పుపట్టారు. జగన్ కు అసలు పరిపాలనే తెలియదని ఎద్దేవా చేశారు.

Tags

Next Story